బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు
- May 27, 2026
అమరావతి: బక్రీద్ (ఈద్-ఉల్-అధా) పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన సందేశంలో గవర్నర్ మాట్లాడుతూ, ఇస్లాం మతంలో బక్రీద్ పర్వదినానికి విశేష ప్రాముఖ్యత ఉందన్నారు. విధేయత, భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ ఈ పండుగను అత్యంత భక్తితో జరుపుకుంటారని పేర్కొన్నారు.
బక్రీద్ త్యాగానికి, సర్వశక్తిమంతుడైన దేవుని పట్ల సంపూర్ణ భక్తికి, పేదల పట్ల కరుణకు ప్రతీకగా నిలుస్తుందని గవర్నర్ తెలిపారు. దానధర్మాలు చేస్తూ అందరితో కలిసి పంచుకోవాలనే గొప్ప సందేశాన్ని ఈ పర్వదినం అందిస్తోందన్నారు.
ఈ పవిత్ర సందర్భంగా సమాజంలో సౌహార్దం, పరస్పర గౌరవం, సద్భావన మరింత పెంపొందాలని గవర్నర్ ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- భారతీయులు శ్రీలంకకు ఉచితంగా వెళ్లవచ్చు..
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక
- కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి నివాసంలో ఈడీ సోదాలు
- విజయవాడ ఎయిర్పోర్టులో విదేశీ ప్రయాణికులకు ఎబోలా పరీక్షలు
- బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు
- పౌరులకు, నివాసితులకు సుల్తాన్ ఈద్ అల్ అదా శుభాకాంక్షలు..!!
- యాత్రికులకు రికార్డుస్థాయిలో మషాయిర్ మెట్రో సేవలు..!!
- ఆన్లైన్ బుకింగ్ మోసాలపై కువైట్ హెచ్చరిక..!!
- సీబీఎస్ఈ 12.. రీవాల్యుయేషన్ కు పెరుగుతున్న దరఖాస్తులు..కారణం ఇదేనా?









