కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి నివాసంలో ఈడీ సోదాలు

- May 27, 2026 , by Maagulf
కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి నివాసంలో ఈడీ సోదాలు

కేరళ రాజకీయ వర్గాల్లో బుధవారం ఉదయం ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. మనీ లాండరింగ్ ఆరోపణల కేసులో కేరళ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు పినరయి విజయన్ నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు విరుచుకుపడ్డారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు.. కేరళ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12 కీలక ప్రాంతాలలో ఏకకాలంలో ఈ మెరుపు సోదాలు నిర్వహిస్తున్నారు.

ఎక్కడెక్కడ సోదాలు సాగుతున్నాయి?
మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. తిరువనంతపురంలోని పినరయి విజయన్ అద్దె ఇల్లు, అలాగే కన్నూరులో ఉన్న ఆయన సొంత నివాసంలో ఉదయం నుంచే సోదాలు ముమ్మరంగా సాగుతున్నాయి. విజయన్ ఇళ్లతో పాటు కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ (CMRL) ఎండీ శశిధరన్ నివాసం, కేరళ మాజీ మంత్రి మహమ్మద్ రియాజ్‌ ఇళ్లలోనూ ఈడీ బృందాలు విచారణ జరుపుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com