లుసైల్ ప్యాలెస్‌లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!

- May 27, 2026 , by Maagulf
లుసైల్ ప్యాలెస్‌లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!

దోహా: లుసైల్ ప్యాలెస్‌లో బుధవారం ఉదయం ఈద్ ప్రార్థనల అనంతరం ఈద్ అల్-అధా వేడుకల్లో అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.  

అమీర్ కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ప్రధాన మంత్రి మరియు విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ బిన్ జస్సిమ్ అల్-థానీ, షూరా కౌన్సిల్ స్పీకర్ హసన్ బిన్ అబ్దుల్లా అల్ ఘనిమ్ ఉన్నారు. అలాగే, మంత్రులు, వివిధ మంత్రిత్వ శాఖల అండర్ సెక్రటరీలు, షూరా కౌన్సిల్ సభ్యులు మరియు పౌరుల బృందాలు కూడా తరలివచ్చారు.

ఈ కార్యక్రమంలో అమీర్ వ్యక్తిగత ప్రతినిధి షేక్ జస్సిమ్ బిన్ హమద్ అల్-థానీ, షేక్ అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్-థానీ, షేక్ మొహమ్మద్ బిన్ ఖలీఫా అల్-థానీ మరియు షేక్ జస్సిమ్ బిన్ ఖలీఫా అల్-థానీ కూడా పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com