సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీపీ సుమతి

- May 28, 2026 , by Maagulf
సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీపీ సుమతి

హైదరాబాద్: మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో ప్రజల భద్రతను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన “మీ సురక్ష” అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది. నేరేడ్మెట్ పోలీసుల ఆధ్వర్యంలో సాయినాథపురంలోని ప్రశాంత్ గార్డెన్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి పలు కాలనీలు, అపార్ట్‌మెంట్‌ల నుంచి మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజిగిరి కమిషనర్ ఆఫ్ పోలీస్ బి. సుమతి, ఐపీఎస్ మాట్లాడుతూ “మీ సురక్ష” యాప్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్న సేవలు, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను వేగంగా సంప్రదించే విధానాన్ని వివరించారు.

అలాగే రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫోన్ కాల్స్, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలు, సోషల్ మీడియా మోసాల నుంచి ఎలా జాగ్రత్తపడాలో ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమాన్ని నేరేడ్మెట్ ఇన్‌స్పెక్టర్ సందీప్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్, ఏసీపీ యాదగిరి రెడ్డి, సైబర్ క్రైమ్ అధికారులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ చేపడుతున్న చర్యలను అధికారులు వివరించగా, హాజరైన ప్రజలు ఆసక్తిగా విన్నారు. ప్రజల్లో భద్రతా అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పలువురు అభిప్రాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com