ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, పురందేశ్వరి భావోద్వేగ నివాళులు

- May 28, 2026 , by Maagulf
ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, పురందేశ్వరి భావోద్వేగ నివాళులు

హైదరాబాద్: తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక, నటుడిగా, ప్రజా నాయకుడిగా చరిత్ర సృష్టించిన నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) (NTR) 103వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద సందడి నెలకొంది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, సినీ రంగ ప్రముఖులు మరియు వేలాది మంది అభిమానులు ఘాట్ వద్దకు చేరుకుని ఆయనకు ఘన నివాళులర్పించారు.

తాతకు శ్రద్ధాంజలి ఘటించిన జూనియర్ ఎన్టీఆర్
నందమూరి వారసుడు, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఉదయాన్నే హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించారు. తన తాత సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి భావోద్వేగంతో అంజలి ఘటించారు. తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ స్థానం ఎప్పటికీ చెరగనిదని, ఆయన చేసిన సేవలు తరతరాలకూ గుర్తుంటాయని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాకతో ఘాట్ పరిసరాల్లో అభిమానులు పెద్ద ఎత్తున గుమిగూడారు. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ కుమార్తె, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. “రామారావు గారిది మరణం లేని జననం. తెలుగుజాతి ఉన్నంత వరకు ఆయన చిరంజీవిగానే ప్రజల గుండెల్లో ఉంటారు. ఒక తిరుగులేని కథానాయకుడిగానే కాకుండా, ప్రజాసేవలో ఆయన తనదైన ముద్ర వేశారు.

తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్–ఒక ప్రభంజనం
‘NTR’ అనే ఈ మూడు అక్షరాలు కేవలం ఒక పేరు కాదు.. అదొక ప్రభంజనం, ఒక సంచలనం. సినీ వినీలాకాశంలో దేవుడిగా గుర్తింపు తెచ్చుకుని, రాజకీయాల్లోకి వచ్చిన కేవలం 9 నెలల్లోనే అధికార పీఠాన్ని దక్కించుకున్న చరిత్ర ఆయనది. తెలుగు సమాజంలో పేదలు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం ఆయన ప్రవేశపెట్టిన పథకాలు నేటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, తెలుగువారి గుండెల్లో నిత్యం స్ఫూర్తి రగిలిస్తూనే ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com