భారత్ లో ఇక ప్లాస్టిక్ కరెన్సీ!

- May 30, 2026 , by Maagulf
భారత్ లో ఇక ప్లాస్టిక్ కరెన్సీ!

న్యూ ఢిల్లీ: భారత్లో చెలామణిలో ఉన్న నగదు కొరత పెరిగిపోవడం, నకిలీలు, బోగస్ నోట్లు దేశంలోకి వెల్లువలా వచ్చిపడుతుండటంతో ఆర్బిఐ కొత్తప్రణాళికలకు దిగింది. ఇకపై ఇప్పటివరకూ ముగిస్తున్న కాగితపు నోట్లకు స్వస్తి చెప్పి వాటి స్థానంలో అత్యంత మన్నికైన ప్లాస్టిక్ అంటే పాలిమర్ నోట్లను ముద్రించే అంశాన్ని ఆర్బీఐ తీవ్రంగా పరిశీలిస్తోంది. పాట్నా, ముంబైలలో జరిగిన అబ్బీఐ బోర్డు సమావేశాలలో ఈ మార్పుపై క్షుణ్ణంగా చర్చలు జరిగినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. వాస్తవానికి ప్రపంచ దేశాల్లో ఇప్పటికే ఈ ప్లాస్టిక్ నోట్లు చలామణిలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 దేశాలు ప్లాస్టిక్ నోట్లను పాక్షికంగా వాడుతున్నప్పటికీ, ఆరుదేశాలు మాత్రం తమ ఆర్థిక వ్యవస్థ నుంచి కాగితపు నోట్లను పూర్తిగా తుడిచేసి, వంద శాతం పాలిమర్ కరెన్సీని వాడుతున్నాయి. 1988లోనే పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టిన ప్రపంచపు మొట్టమొదటి దేశం ఆస్ట్రేలియా. ప్రస్తుతం ప్రపంచంలో ఈ నోట్లను ఉత్పత్తి చేస్తున్న ఏకైక దేశం కూడా ఇదే.

ప్రపంచంలోని 60 దేశాల్లో ప్లాస్టిక్ నోట్లే

న్యూజిలాండ్ లో 1999లోనే తన కాగితపు కరెన్సీ మొత్తాన్ని – ప్రపంచంలోని 60 దేశాల్లో ఇదే చెలామణి నకిలీలు, బోగస్ నోట్లకు సరైన ప్రత్యామ్నాయం చలామణి నుంచి తొలగించింది. ఇక్కడ 5 నుంచి 100 వరకు అన్నీ ప్లాస్టిక్ నోట్లే చలామణిలో ఉన్నాయి. ఆగ్నేయాసియాలోని సంపన్న దేశం బ్రూనై నకిలీ నోట్ల ముప్పును పూర్తిగా నిర్మూలించడానికి ప్లాస్టిక్ నోట్లను స్వీకరించింది. అలాగే వియత్నాంలో కూడా 2003లో పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టారు. ఇక్కడి కరెన్సీడాంగ్ పూర్తిగా ప్లాస్టిక్తోనే తయారవుతుంది. 2005లో రొమేనియా దేశంలోని అన్ని నోట్లను పాలిమర్ కరెన్సీగా మార్చిన ఏకైక యూరోపియన్ దేశంగా రికార్డు సృష్టించింది. 1975 తర్వాత కినా అనే సరికొత్త ప్లాస్టిక్ కరెన్సీని గినియా వాడుకలోకి తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ కరెన్సీకి పెరుగుతున్న క్రేజ్.. కానీ ప్రస్తుతం సింగపూర్, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, పపువా కెనడా వంటి దాదాపు 60 దేశాల్లో ఈ సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చింది.

రూపాయి కూడా సరికొత్త ప్లాస్టిక్ రూపంలో..

ప్రపంచంలోనే అత్యంత బలమైన కరెన్సీ అయిన అమెరికా డాలర్ మాత్రం ఇప్పటికీ పూర్తిగా ప్లాస్టిక్తో తయారుకాలేదు. అమెరికా తన కరెన్సీని పత్తి, నారల ప్రత్యేక మిశ్రమంతో తయారు చేస్తుంది. ప్రస్తుతం ప్రపంచ ధోరణిని బట్టి చూస్తే త్వరలోనే భారత కరెన్సీ రూపాయి కూడా సరికొత్త ప్లాస్టిక్ రూపంలో మన జేబుల్లోకి రావడం ఖాయంగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. నోట్లను దశలవారీగా తొలగించి, ప్లాస్టిక్ నోట్లను తీసుకురావడానికి ప్రధాన కారణాలు లేకపోలేదు. వాటి తక్కువ ఖర్చు, ఎక్కువ మన్నిక అనే చెబుతున్నారు. సాధారణ కాగితపు నోట్ల కంటే ప్లాస్టిక్ నోట్లు సుమారు రెండున్నర రెట్లు ఎక్కువ కాలం చలామణిలో ఉండగలవని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. ఈ నోట్లు నీరు, తేమ, మురికిని సులభంగా తట్టుకోవడం పెద్ద ప్లస్ అని అంటున్నారు. ఈ నోట్లు అంత తేలిగ్గా చిరగవు. దీనివల్ల పదేపదే కొత్త నోట్లు ముద్రించే ఖర్చు ప్రభుత్వానికి తప్పుతుంది. అన్నింటికంటే ప్లాస్టిక్ నోట్లను నకిలీ చేయడం లేదా కాపీ కొట్టడం ఎవరికీ సాధ్యం కాదని చెబుతున్నారు. ఇన్ని ప్రత్యేకతలు ఉండటం వల్లనే ఆర్బీఐ కూడా పాలిమరకరెన్సీ వైపు మొగ్గుచూపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సెంట్రల్ బ్యాంకు నుంచి మాత్రం ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com