ధోఫార్‌లో టూరిజానికి బూస్ట్.. ‘యోర్ పాత్ ఈజ్ గ్రీన్’ కు శ్రీకారం..!!
- July 17, 2026
సలాలా: ఒమన్‌లోని ధోఫార్ గవర్నరేట్‌లో పర్యాటకులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ‘యోర్ పాత్ ఈజ్ గ్రీన్’ (Your Path is Green) పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని హెరిటేజ్ మరియు టూరిజం మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. గురువారం అల్ బలీద్ పురావస్తు పార్క్‌లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఖరీఫ్ ధోఫార్–2026 ను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా అవాసర్ (Awasr) కంపెనీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమం ద్వారా ధోఫార్‌కు వచ్చే సందర్శకుల్లో పర్యాటక అవగాహన పెంపొందించడం, డిజిటల్ కమ్యూనికేషన్ విధానాలు మరియు స్మార్ట్ మార్గదర్శక సందేశాల ద్వారా ప్రజా భద్రత, పర్యావరణ పరిరక్షణపై చైతన్యం కల్పించడం, అలాగే పర్యాటకుల అనుభవాన్ని మరింత మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.
హెరిటేజ్, పర్యాటక ప్రాంతాల్లో గైడెడ్ ఫీల్డ్ టూర్లు నిర్వహించడంతో పాటు, సందర్శకులతో ప్రత్యేక మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన సందేశాలను పరస్పర చర్చల రూపంలో అందించనున్నారు. ఇందుకోసం అవాసర్ కంపెనీ డిజిటల్ మౌలిక సదుపాయాలను వినియోగించనున్నారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి సలాలా వాలి షేక్ డాక్టర్ సయీద్ బిన్ హుమైద్ అల్ హార్థీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







