దుబాయ్ కార్మికులకు ఉచిత ఐస్‌క్రీమ్ పంపిణీకి యూఏఈ నివాసితులకు స్వచ్ఛంద సేవ చేసే అవకాశం
- July 17, 2026
దుబాయ్: మండే వేసవిలో ఆరుబయట కష్టపడి పనిచేస్తున్న బ్లూ కాలర్ కార్మికులకు చల్లని ఉపశమనం అందించేందుకు దుబాయ్‌లోని స్ప్రెడ్ కైండ్‌నెస్ వాలంటీరింగ్ టీమ్ మరోసారి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. "బీట్ ది హీట్ విత్ ది కూల్ ట్రీట్" అనే నినాదంతో రెండో ఏడాది నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో 19 వేల మందికి పైగా కార్మికులకు ఉచితంగా ఐస్‌క్రీమ్ పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
కమ్యూనిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (CDA)లో నమోదైన ఈ స్వచ్ఛంద సంస్థలో యూఏఈ నివాసితులు కూడా వాలంటీర్లుగా చేరి సేవలందించవచ్చని నిర్వాహకులు తెలిపారు.
సంస్థ వ్యవస్థాపకురాలు ఆయిషా ఇస్మాయిల్ మాట్లాడుతూ, "ఎండలో కష్టపడుతున్న మన బ్లూ కాలర్ సోదరులకు కాస్త ఉపశమనం, వారి ముఖంలో చిరునవ్వు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం" అని తెలిపారు.
2015లో కొద్దిమంది స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఓపెన్ ఆర్మ్స్ పేరుతో ప్రారంభమైన ఈ సేవా కార్యక్రమం, ఈ ఏడాది స్ప్రెడ్ కైండ్‌నెస్ పేరుతో పునఃవ్యవస్థీకరించబడింది. ఇప్పుడు CDAలో అధికారికంగా నమోదు చేసుకుని మరింత విస్తృత స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
ప్రతి పంపిణీ కార్యక్రమం ప్రారంభానికి ముందు వాలంటీర్లకు భద్రత, నీటి వినియోగం (హైడ్రేషన్)పై అవగాహన కల్పిస్తారు. అనంతరం ఐస్‌క్రీమ్ వాహనంతో పని ప్రదేశాలకు వెళ్లి, సైట్ సూపర్‌వైజర్ల సహకారంతో విరామ సమయంలో కార్మికులకు ఐస్‌క్రీమ్ అందజేస్తారు.
"మా నగరాన్ని నిర్మిస్తున్నందుకు ధన్యవాదాలు" అని చెబుతూ కార్మికులకు చల్లని ఐస్‌క్రీమ్ అందించడం ద్వారా వారి అలసట క్షణాల్లోనే చిరునవ్వుగా మారుతుందని ఆయిషా ఇస్మాయిల్ పేర్కొన్నారు. కొందరు ఫోటోలు దిగుతారని, మరికొందరు "షుక్రాన్" అంటూ కృతజ్ఞతలు తెలుపుతారని, అదే తమ సేవకు నిజమైన ప్రేరణ అని చెప్పారు.
వాలంటీర్‌గా ఎలా చేరాలి?
సేవ చేయాలనుకునే యూఏఈ నివాసితులు CDA Volunteer Portal లేదా DubaiNow యాప్‌లో "Spread Kindness" పేరుతో నమోదు చేసుకోవచ్చు. వాలంటీర్‌గా చేసిన సేవా గంటలను CDA అధికారికంగా నమోదు చేయడంతో పాటు పాల్గొన్న వారికి సర్టిఫికెట్ కూడా అందజేస్తుంది.
అలాగే ఆర్థికంగా సహాయం చేయాలనుకునే వారు AES కమ్యూనిటీ కేర్ క్లబ్ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఐస్‌క్రీమ్ పంపిణీ కార్యక్రమానికి విరాళాలు అందించవచ్చు. జూలై 26 మరియు ఆగస్టు 23 తేదీల్లో మధ్యాహ్నం 12 గంటలకు రెండు ప్రత్యేక పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఒక్కో వ్యక్తి నుంచి 30 దిర్హమ్‌ల నుంచి విరాళాలు స్వీకరిస్తారు. ఈ మొత్తం నేరుగా ఐస్‌క్రీమ్ సరఫరాదారుకు చెల్లించబడుతుంది.
ఇదే కాకుండా ప్రతి శనివారం అల్ నహ్దా-1 ప్రాంతంలో ఉదయం 11.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కార్మికులకు ఉచిత భోజన పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఈ సంస్థ నిర్వహిస్తోంది.
"ఇది కేవలం ఐస్‌క్రీమ్ ఇవ్వడం మాత్రమే కాదు... కార్మికుల పట్ల గౌరవం, ఆత్మీయత, మానవత్వాన్ని చాటే ప్రయత్నం" అని ఆయిషా ఇస్మాయిల్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో వాలంటీర్‌గా చేరాలనుకునే లేదా విరాళం అందించాలనుకునే వారు 056 312 7666 నంబర్‌ను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.

తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







