బహ్రెయిన్‌లో బోట్స్ రాకపోకలపై నిషేధం పొడిగింపు..!!

- July 17, 2026 , by Maagulf
బహ్రెయిన్‌లో బోట్స్ రాకపోకలపై నిషేధం పొడిగింపు..!!

మనామా: సముద్ర భద్రతను మరింత బలోపేతం చేయడం, తీర ప్రాంతాల రక్షణను మెరుగుపరచడం లక్ష్యంగా బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Interior) చేపల వేట పడవలు, విహార(pleasure) పడవల సంచారంపై అమలులో ఉన్న రాత్రి నిషేధ సమయాన్ని సవరించింది. కొత్త నిర్ణయం ప్రకారం.. జూలై 16 నుంచి తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ప్రతిరోజూ సాయంత్రం 6:30 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 4:00 గంటల వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది.

సముద్ర రాకపోకలను నియంత్రించే కొనసాగుతున్న చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. సముద్రంలో అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనే సన్నద్ధతను పెంచడంతో పాటు, సెయిలర్స్ మరియు సముద్రాన్ని వినియోగించే ప్రతి ఒక్కరి భద్రతను కాపాడటమే ఈ చర్య ప్రధాన ఉద్దేశమని పేర్కొంది.

నిషేధ సమయాల్లో తీర ప్రాంతాలకు చేరకుండా ఉండాలని, కొత్త నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com