ఏపీ విద్యార్థులకు తీపికబురు.. జేఈఈ, నీట్ ఉచిత కోచింగ్..
- June 01, 2026
అమరావతి: ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు తీపికబురు అందించింది. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశంతో ఏపీ ఎక్స్లెన్స్ సెంటర్లు నీట్ జేఈఈ ఉచిత శిక్షణ ద్వారా కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందించేందుకు సిద్ధమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థులకు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో సత్తా చాటేలా ఈ కార్యక్రమం రూపొందించారు. 2026-27 విద్యాసంవత్సరం నుండి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఏడు ప్రత్యేక కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించనుంది. ప్రైవేట్ విద్యాసంస్థల భాగస్వామ్యంతో ఈ శిక్షణా కార్యక్రమాలను పక్కాగా అమలు చేయనున్నారు. ప్రభుత్వం ఈ సెంటర్లను నిరంతరం పర్యవేక్షించి, విద్యార్థులకు అత్యుత్తమ కోచింగ్ అందేలా చర్యలు తీసుకుంటుంది. ఇంటర్మీడియట్ చదువుకుంటూనే వైద్య, ఇంజనీరింగ్ కోర్సులకు అవసరమైన శిక్షణ పొందడం వల్ల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.
ఎంపిక ప్రక్రియ
ఈ ఎక్స్లెన్స్ సెంటర్ల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4,200 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో కేంద్రంలో 500 నుండి 600 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పదో తరగతి పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ప్రతిభ కలిగిన వారిని ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గురుకుల భవనాలను లేదా కొత్త భవనాలను ఇందుకోసం సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ భవనాల కొరత ఉంటే, ప్రస్తుత గురుకుల విద్యార్థులను వేరే ప్రాంతాలకు సర్దుబాటు చేసి ఈ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. కో-ఎడ్యుకేషన్ విధానంతో పాటు అవసరమైతే బాలికల కోసం ప్రత్యేక కేంద్రాలను కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.
సెంటర్ల ఏర్పాటు
ఎస్సీ విద్యార్థులకు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లో మూడు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. బీసీ విద్యార్థుల కోసం అనంతపురం, రాజమహేంద్రవరం మరియు ఉత్తరాంధ్రలో మొత్తం రెండు కేంద్రాలను కేటాయిస్తారు. ఎస్టీ విద్యార్థులకు విశాఖపట్నం, రాయలసీమ ప్రాంతాల్లో మరో రెండు కేంద్రాలను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. ఐఐటీ, వైద్య విద్య వంటి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలనుకునే గ్రామీణ విద్యార్థులకు ఇది ఒక గొప్ప అవకాశం. ఆర్థిక స్థోమత లేని వారు కూడా ఈ కోచింగ్ ద్వారా జాతీయ స్థాయి సంస్థల్లో సీట్లు సాధించే దిశగా అడుగులు వేయవచ్చు. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసానిచ్చే ఈ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ విద్యార్థులకు తీపికబురు.. జేఈఈ, నీట్ ఉచిత కోచింగ్..
- ఇరాన్, అమెరికా శాంతి చర్చల్లో కుదరని స్పష్టత..
- గుజరాత్ ఆటగాళ్లకు తప్పిన పెను ప్రమాదం
- కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు డ్రోన్లు, క్షిపణి దాడులను తిప్పికొట్టాయి
- IRGC-అనుబంధ నెట్వర్క్ బస్ట్.. 41 మంది అరెస్ట్..!!
- కువైట్ లో 90 నిమిషాల ముందే చెక్-ఇన్ కౌంటర్లు మూసివేత..!!
- యూఏఈలో ఫ్యూయల్, సాలిక్ , పార్కింగ్ లో మార్పులతో అదనపు భారం..!!
- ఒమన్లోకి అక్రమంగా ప్రవేశించిన 22 మంది అరెస్టు..!!
- ఖతార్లో అమల్లోకి వచ్చిన ఔట్ సైడ్ సమ్మర్ వర్కింగ్ అవర్స్..!!
- ప్రాంతీయ భద్రతపై క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ అధ్యక్షుడు చర్చలు..!!









