బలమైన ఆర్థిక సంబంధాలపై బహ్రెయిన్, ఫ్రాన్స్ చర్చలు..!!

- June 02, 2026 , by Maagulf
బలమైన ఆర్థిక సంబంధాలపై బహ్రెయిన్, ఫ్రాన్స్  చర్చలు..!!

మనామా: పారిస్‌లో జరిగిన “చూజ్ ఫ్రాన్స్” సదస్సు సందర్భంగా ఫ్రాన్స్ ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక, ఇంధన మరియు డిజిటల్ సార్వభౌమత్వ శాఖ మంత్రి రోలాండ్ లెస్క్యూర్‌తో
బహ్రెయిన్ ఆర్థిక మంత్రి,  బహ్రెయిన్ ముమ్తాలకత్ హోల్డింగ్ కంపెనీ ఛైర్మన్ షేక్ సల్మాన్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా సమావేశమయ్యారు. ఈ సమావేశం సందర్భంగా బహ్రెయిన్ మరియు ఫ్రాన్స్ మధ్య ఉన్న దీర్ఘకాలిక సంబంధాలపై సమీక్షించారు. ఆర్థిక, వాణిజ్య మరియు పెట్టుబడి రంగాలలో బలమైన సహకారాన్ని పెంపొందించుకునే మార్గాలను విస్తరించాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి.

ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం, ఇరు దేశాల మధ్య సహకారాన్ని విస్తరించుకోవడం ప్రాముఖ్యతను షేక్ సల్మాన్ బిన్ ఖలీఫా తెలియజేశారు. ఉమ్మడి ఆర్థిక ఆకాంక్షలు మరియు దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలకు మద్దతుగా నైపుణ్యం మరియు ఉత్తమ పద్ధతులను పంచుకోవాలని సూచించారు.  

ఈ చర్చలలో బహ్రెయిన్ మరియు ఫ్రాన్స్ మధ్య కొనసాగుతున్న ఆర్థిక సహకారాన్ని, అలాగే సంబంధాలను మరింతగా పెంపొందించే మార్గాలను కూడా సమీక్షించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలపై తమ అభిప్రాయాలను షేర్ చేశారు. వీటితోపాటు ఇరుపక్షాలు పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com