ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- June 03, 2026
కువైట్: మిస్సైల్, డ్రోన్ దాడుల నేపథ్యంలో ప్రజలకు కువైట్ సైన్యం కీలక సూచనలు చేసింది. వివిధ ప్రాంతాల్లో వినిపించే పేలుడు శబ్దాల పట్ల ప్రజలు ఆందోళన చెందవద్దని, సంబంధిత అధికారులు జారీ చేసిన సూచనలను పాటించాలని కోరింది. ఈమేరకు రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి, కల్నల్ సౌద్ అబ్దుల్ అజీజ్ అల్-అత్వాన్ పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారు.
కువైట్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అడ్డుకున్న నేపథ్యంలో కింద పడిన ఏవైనా శిథిలాలు, శకలాలు లేదా గుర్తించలేని వస్తువులకు దూరంగా ఉండాలని, వాటిని తాకే ప్రయత్నం చేయవద్దని పౌరులను మరియు నివాసితులను హెచ్చరించారు. అటువంటివి భద్రతకు ప్రమాదం కలిగించగలవని, అలాంటి వాటిని గుర్తిస్తే వెంటనే అత్యవసర హాట్‌లైన్ నెంబర్ 112కు లేదా సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా సంస్థలకు సహకరించాలని, భద్రతా ఆదేశాలను పాటించాలని కువైట్ సైన్యం పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







