షేక్ అమీర్ ఆలీని అరెస్టు చేసిన కర్నాటక సీఐడీ పోలీసులు
- August 09, 2016
నల్గొండలో దీనదార్ అంజుమన్ సంస్థకు చెందిన ఉగ్రవాది షేక్ అమీర్ ఆలీని కర్నాటక సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. 2000 ఏడాదిలో గుల్బర్గ ప్రాంతంలో జరిగిన వరుస పేలుళ్ల కేసులో ఆలీ ప్రధాన నిందితుడు. అప్పటి నుంచి పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. 16 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న ఆయన కొద్ది రోజులుగా నల్గొండలో తిరుగుతున్నాడని పక్కా సమాచారం అందుకున్న హైదరాబాద్, కర్నాటక సీఐడీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి నొల్గొండలోని ఆలీ తన బంధువుల ఇంట్లో ఉన్న సమయంలో పోలీసులు అరెస్టు చేశారు. హుబ్లీ, జేజేనగర్, వాడి, గోవాలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ఆలీ నిందితుడు. ఆలీని హుబ్లీకి తరలించే అవకాశం ఉంది. అక్కడ కోర్టులో హాజరుపరిచిన తర్వాత పోలీసు కస్టడీకి తీసుకుని విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







