వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- June 06, 2026
దోహా: ఖతార్‌లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు బయట ఉన్నప్పుడు వేడి వల్ల కలిగే అనారోగ్య సమస్యల (heat stress) నుండి రక్షణ పొందేందుకు 'పబ్లిక్ హెల్త్ మంత్రిత్వ శాఖ' (MoPH) కొన్ని సూచనలను జారీ చేసింది.
1. ప్రతి 15-20 నిమిషాలకు ఒకసారి చల్లని నీటిని తాగాలి.
2. టీ, కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ మరియు సాఫ్ట్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలి .
3. నీడ లేదా చల్లని ప్రదేశంలో రెస్ట్ తీసుకోవాలి.
4. ఆరోగ్యకరమైన మరియు తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి.
5. తేలికపాటి మరియు వదులుగా ఉండే దుస్తులను ధరించాలి.
6. బయట ఉన్నప్పుడు తల కవర్ అయ్యేలా కప్పుకోవాలి.
వలస కార్మికులకు ఈ సమాచారం విస్తృతంగా చేరేలా చూసేందుకు, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ సూచనలను ఇంగ్లీష్, అరబిక్, ఉర్దూ మరియు ఇతర ఆసియా భాషలతో సహా వివిధ భాషలలో ప్రచురించింది.
వేసవి కాలంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లో పని చేయడాన్ని కార్మిక మంత్రిత్వ శాఖ నిషేధించింది. సెప్టెంబర్ 15 వరకు అమల్లో ఉండే ఈ నిబంధన ప్రకారం, బహిరంగ ప్రదేశాల్లో పనులు నిర్వహించే యజమానులు, కంపెనీలు మరియు సంస్థలు తమ పని వేళలను మార్చుకోవాలి. అలాగే, కార్మికులకు తగిన విశ్రాంతి ఏర్పాట్లు చేయాలి.
తాజా వార్తలు
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- పిల్లల స్పోర్ట్స్ ట్రైనింగ్ పై హీట్ స్ట్రెస్ ఎఫెక్ట్..పేరెంట్స్, డాక్టర్లు ఆందోళన..!!
- తాత్కాలికంగా మూసివేసిన గగనతలాన్ని తిరిగి తెరిచిన కువైట్
- ఢిల్లీ అగ్నిప్రమాదం కేసులో హోటల్ వంటవాడు అరెస్ట్
- NRIలకు శుభవార్త..ఆ రూల్ మార్చేసిన టీటీడీ
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు









