ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!

- June 06, 2026 , by Maagulf
ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!

మనామా: ఇరాన్ తాజా దాడులను బహ్రెయిన్ తీవ్రంగా ఖండించింది.  "భద్రత క్షిపణులు లేదా డ్రోన్‌లతో నిర్మించబడదు" అని పేర్కొంది. "సహనం బలహీనతకు సమానం కాదు" అని బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ప్రాంతంలో శాంతి మరియు స్థిరత్వానికి తాము కట్టుబడి ఉన్నామని తేల్చిచెప్పింది.  

అంతకుముందు కువైట్ మరియు బహ్రెయిన్ వైపు ప్రయోగించిన ఏడు ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నట్టు బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.   ఈ సందర్భంగా క్షిపణులు, డ్రోన్లతో భద్రతను నిర్మించలేమని, అలాగే మందుపాతరలు పాతడం ద్వారా స్థిరత్వాన్ని కాపాడలేమని బహ్రెయిన్ పేర్కొంది. సముద్రంలోని మందుపాతరల స్థానాలను వెల్లడించాలని, వాటిని తొలగించడంలో సహకరించాలని ఇరాన్‌ను కోరింది. అన్యాయమైన దాడులను తక్షణమే నిలిపివేసి, శాంతిని స్వీకరించాలని ఇరాన్‌కు పిలుపునిచ్చింది.

ఇరాన్ తాజా దాడులు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే స్పష్టమైన దురాక్రమణ అని, అరేబియా గల్ఫ్ ప్రాంత భద్రత, స్థిరత్వానికి ముప్పు అని అభివర్ణించింది.  

20 వేలమందికి పైగా నావికులు చిక్కుకుపోయిన నేపథ్యంలో, పౌర నౌకల సురక్షిత ప్రయాణానికి హామీ ఇచ్చే సురక్షిత మానవతా కారిడార్‌ను తెరవాలని, అలాగే నావికులు బయలుదేరి వారి కుటుంబాల వద్దకు సురక్షితంగా తిరిగి వెళ్లేందుకు అనుమతించాలని బహ్రెయిన్ ఇరాన్‌కు పిలుపునిచ్చింది.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com