ఒమన్, కువైట్ మధ్య ద్వైపాక్షిక సహకారం బలోపేతం..!!
- June 09, 2026
జబల్ అఖ్దర్: అల్ దఖిలియా గవర్నరేట్‌లోని జబల్ అఖ్దర్‌లో ఒమన్-కువైట్ సంయుక్త కమిటీ 11వ సమావేశం జరిగింది. ఈ సమావేశం ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బద్ర్ బిన్ హమద్ అల్ బుసైది మరియు కువైట్ విదేశాంగ మంత్రి షేక్ జర్రాహ్ జాబర్ అల్ అహ్మద్ అల్ సబా అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా ఒమన్-కువైట్ దేశాల మధ్య ఉన్న లోతైన చారిత్రక, వాణిజ్య సంబంధాల పురోగతిని సమీక్షించారు. అలాగే, ఉమ్మడి ప్రాధాన్యతా రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకునే మార్గాలపై చర్చించారు.
ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక మరియు శాస్త్రీయ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడంతోపాటు ఒమన్ మరియు కువైట్ మధ్య మరింత సమగ్రమైన భాగస్వామ్యాన్ని సాధించడానికి నైపుణ్యాలు మరియు అనుభవాలను పరస్పరం పంచుకోవడం వంటి అంశాలపై దృష్టి సారించినట్లు సయ్యద్ బద్ర్ తెలిపారు. ఒమన్-కువైట్ సంయుక్త కమిటీ సమావేశాలు క్రమం తప్పకుండా జరగడం అనేది రెండు దేశాల ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు.
కువైట్ విదేశాంగ మంత్రి షేక్ జర్రాహ్ జాబర్ అల్ అహ్మద్ అల్ సబా మాట్లాడుతూ.. ఈ ఏడాది ఒమన్-కువైట్ దౌత్య సంబంధాల 55వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం.. వివిధ స్థాయిలలో సాధించిన అభివృద్ధిని ప్రతిబింబిస్తుందని చెప్పారు. ఒమన్ -కువైట్ మధ్య ఉన్న లోతైన చారిత్రక సంబంధాలు GCC దేశాల మధ్య నిజాయితీతో కూడిన సోదరభావ సంబంధాలకు ఒక ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ఈ సందర్భంగా కుదిరిన పలు రంగాలకు చెందిన ఒప్పందాలపై అధికారులు సంతకాలు చేశారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







