తెలంగాణలో అక్టోబర్ 11 నుంచి కొత్త జిల్లాలు ఏర్పాటు
- August 09, 2016
తెలంగాణలో అక్టోబర్ 11 (విజయదశమి) నుంచి కొత్త జిల్లాలు ఏర్పాడతాయని సీఎం కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్ లో మంగళవారం ఆయన ఉన్నతాధికారులతో జరిపిన సమీక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు.కొత్త జిల్లాల ఏర్పాటుపై ఈ నెల మూడో వారంలో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు కేసీఆర్ చెప్పారు. జిల్లాల ఏర్పాటుపై అన్ని వర్గాల నుంచి వచ్చే ప్రతిపాదనలు చర్చించి, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు కేబినేట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం మహముద్ అలీ అధ్యక్షతన మంత్రులు కడియం శ్రీహరి, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. దీనికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలు జారీ చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌కు ముందు కేబినేట్, అఖిలపక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. డ్రాఫ్ట్ విడుదలైన తర్వాత అభ్యంతరాలు, సూచనలకు నెల రోజుల గడువు ఇవ్వనున్నట్లు కేసీఆర్ చెప్పారు.
తాజా వార్తలు
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి







