కర్ణాటక బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు అరెస్టు
- August 09, 2016
పదహారేళ్ల క్రితం కర్ణాటకలో ఏక కాలంలో వివిధ చోట్ల బాంబు పేలుళ్లకు పాల్పడిన ఘటనలో ఉగ్రవాది షేక్ అమీర్ ఆలీ ఆ రాష్ట్ర సీఐడీ అధికారులకు పట్టుబడ్డాడు. కర్ణాటక రాష్ట్ర అదనపు డీజీపీ ప్రతాప్‌రెడ్డి నేతృత్వంలోని అధికారులు తెలంగాణ పోలీసుల సహకారంతో నల్లగొండ జిల్లా కోదాడలో సోమవారం రాత్రి అమీర్‌ను అరెస్టు చేశారు. దీన్‌దార్ అంజుమాన్ సంస్థ పేరుతో 2000 జూలైలో బెంగళూరులోని జేజే నగర్, హుబ్లీ, కలబుర్గీలో ఏక కాలంలో కొంతమంది బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ పేలుళ్ల వెనుక 29 మంది ఉన్నట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. వీరిలో 23 మంది పట్టుబడి వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. మిగిలిన ఏడుగురిలో ఐదుగురు పాకిస్తాన్‌కు చెందిన వారు. మిగిలిన ఇద్దరిలో అమీర్ తాజాగా పట్టుబడగా.. మరొకరు పరారీలో ఉన్నారు. అలీ ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందినవాడు. అప్పట్లో అతనిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయింది. అప్పటి నుంచి అజ్ఞాతంలోనే ఉంటున్నాడు. కాగా, అలీ ఐదేళ్లుగా కుటుంబ సభ్యులతో కలసి కోదాడలోనే నివాసం ఉన్నట్లు తెలిసింది. పట్టణంలోని రెహనాజ్ హెల్త్ సెంటర్ పేరిట క్లినిక్‌ను నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







