ప్రముఖ దర్శకుడు భారతీరాజా కన్నుమూత..
- June 10, 2026
చెన్నై: ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యం, వృద్ధాప్యంతో బాధడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. ఈ ఘటనతో తమిళ, తెలుగు సినీ పరిశ్రమ షాక్‌లోకి వెళ్లిపోయింది. ఆయన అభిమానులు, పలువురు సినీ, రాజకీయ నాయకులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు.
1977లో వచ్చిన తమిళ మూవీ 16 వయథినిలే తో ఆయన దర్శకుడిగా మారారు. తమిళంలోనే కాకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనూ ఆయన తన చెరగని ముద్రను వేశారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ లవ్ స్టోరీ ‘సీతాకోకచిలుక’ ఇక్కడి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఆ తర్వాత వచ్చిన ‘ఆరాధన’, ‘జమదగ్ని’, ‘ఈతరం ఇల్లాలు’ వంటి చిత్రాలు ఆయనలోని వైవిధ్యాన్ని, సామాజిక స్పృహను చాటిచెప్పాయి. కథలో ఉండే భావోద్వేగాలను వెండితెరపై పండించడంలో ఆయన శైలి ఎందరో యువ దర్శకులకు నేటికీ ఒక పాఠ్యపుస్తకం లాంటింది.
దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ భారతీరాజా తనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించారు. వయసుతో నిమిత్తం లేకుండా స్క్రీన్ పై నెగెటివ్ పాత్రల్లోనూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ మెప్పించారు. మణిరత్నం ‘యువ’ చిత్రంలో రాజకీయ నాయకుడిగా ఆయన నటన అద్భుతం. అలాగే ‘సీతకత్తి’, ‘ఈశ్వరన్’, ‘సార్’, ‘తిరు’, ఇటీవలి బ్లాక్‌బస్టర్ ‘మహారాజా’ వంటి సినిమాల్లో విలక్షణమైన పాత్రలు పోషించి నటుడిగానూ తానేంటో నిరూపించుకున్నారు.
భారతీరాజా సినీ రంగానికి చేసిన అసమాన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం ఆయనను ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఆయన 6 జాతీయ చలనచిత్ర అవార్డులు, 4 ఫిల్మ్‌ఫేర్ (సౌత్) అవార్డులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డు, పలు తమిళనాడు రాష్ట్ర అవార్డులను అందుకున్నారు. కమల్ హాసన్, రజనీకాంత్ వంటి స్టార్ హీరోల కెరీర్‌ను మలుపు తిప్పడంలో, అలాగే రాధిక, రేవతి వంటి మేటి నటీమణులను ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో ఆయన పాత్ర అనన్యసామాన్యం.
కుంగదీసిన కుమారుడి మరణం..
ఆయన కుమారుడు నటుడు మనోజ్ భారతీరాజా (48) మార్చి 2025లో గుండెపోటుతో మరణించారు. కుమారుడి మృతితో భారతీరాజా కృంగిపోయారు. ఆ బాధ నుంచి ఆయన తేరుకోలేకపోయారు.
తాజా వార్తలు
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- UAEU Concludes Participation in the Arab Media Summit 2026
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!







