FTPC ఇండియా మేకోవర్ కమిటీ చైర్మన్‌గా బొలిశెట్టి ప్రణవి నియామకం

- June 10, 2026 , by Maagulf
FTPC ఇండియా మేకోవర్ కమిటీ చైర్మన్‌గా బొలిశెట్టి ప్రణవి నియామకం

విజయవాడ: బాలీవుడ్ నటి ఈల్మ షేక్ చేతుల మీదుగా నియామక పత్రం స్వీకారం.తన మేకోవర్ నైపుణ్యంతో ఇప్పటికే పలువురు బాలీవుడ్, టాలీవుడ్ సినీ తారల ప్రశంసలు అందుకున్న బొలిశెట్టి ప్రణవిని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మేకోవర్ కమిటీ చైర్మన్‌గా నియమించినట్లు సంస్థ అధ్యక్షుడు చైతన్య జంగా, ప్రధాన కార్యదర్శి విజయ్ వర్మ పాకలపాటి తెలిపారు.

మేకోవర్ రంగంలో యువతకు శిక్షణ అందించి రాష్ట్ర, దేశవ్యాప్తంగా వెయ్యి మందికి పైగా నిపుణులను తయారు చేయాలనే లక్ష్యంతో ఈ బాధ్యతలను ప్రణవికి అప్పగించినట్లు వారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు చైతన్య జంగా మాట్లాడుతూ, కోట్ల రూపాయల వ్యాపారంగా విస్తరించిన బ్యూటీ రంగంలో యువతకు విశేష అవకాశాలు కల్పించి ఉపాధి పొందేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని, సమర్థురాలైన ప్రణవి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తొలి ఏడాదిలోనే వెయ్యి మందికి శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.మేకోవర్ రంగానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన ఎఫ్‌టీపీసీ ఇండియాకు బాలీవుడ్ నటి ఈల్మ షేక్ అభినందనలు తెలిపారు. నియామక పత్రాన్ని స్వీకరించిన బొలిశెట్టి ప్రణవి మాట్లాడుతూ...తన అనుభవంతో ఈ రంగంలో ఆసక్తి ఉన్న వారికి నాణ్యమైన శిక్షణ అందిస్తానని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలను అప్పగించిన సంస్థ అధ్యక్షుడు చైతన్య జంగా, ప్రధాన కార్యదర్శి విజయ్ వర్మ పాకలపాటికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు జన్ను పవన్, వెంకట్, సూర్య తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com