‘తుఝ్‌పే ఫిదా’ సాంగ్ రిలీజ్
- June 10, 2026
మోస్ట్ టాలెంటెడ్, ఎనర్జిటిక్ రుత్విక్‌ను హీరోగా పరిచయం చేస్తూ వృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కె. నిహారిక దాసరి చిత్రం ‘రాజా ది రాజా’. నేటి తరానికి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్, అందమైన ప్రేమకథతో మేళవిస్తూ ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ఇప్పటికే విడుదలైన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మేకర్స్ మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేశారు. సినిమా నుంచి తుఝ్‌పే ఫిదా సాంగ్ ను విడుదల చేశారు.
మార్క్ కె. రాబిన్ స్వరపరిచిన ఈ మెలోడీయస్ లవ్ ట్రాక్‌కు మనోజ్ జూలూరి అందమైన సాహిత్యాన్ని అందించారు. హరిచరణ్, శక్తి శ్రీ గోపాలన్ వోకల్స్ పాటను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
సముద్ర తీరంలో చిత్రీకరించిన ఈ పాట విజువల్‌గా ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ, అందమైన లొకేషన్స్, ఫ్రెష్ విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. హరి కిరణ్ మాస్టర్, ఈశ్వర్ పెంటి కొరియోగ్రఫీ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
పాటలో కనిపించిన రొమాంటిక్ ఫీల్, యూత్‌ఫుల్ ఎనర్జీ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
టీజర్‌తో ఆకట్టుకున్న ‘రాజా ది రాజా’ ఇప్పుడు ‘తుఝ్‌పే ఫిదా’ పాటతో మరింత ఆసక్తిని పెంచింది.
తారాగణం:
రుత్విక్, విశాఖ ధీమాన్, సాయి కుమార్, డా. నరేష్ విజయ కృష్ణ, అవసరాల శ్రీనివాస్, విష్ణు ఓయి, పార్వతీశం, రాజశ్రీ నాయర్, రోహిణి, బద్రం, మైమ్ మధు, ఆనంద్
సిబ్బంది:
బ్యానర్: వృందావన్ క్రియేషన్స్
సమర్పణ: కె శ్రీలత రెడ్డి
నిర్మాత: కె. నిహారిక దాసరి
దర్శకత్వం: అనిల్ బోయిడపు
డీవోపీ: రవికిరణ్ బోయిడపు
సంగీతం: మార్క్ కె రాబిన్
ఆర్ట్ డైరెక్టర్: విజయ్ కుమార్ పసుపులేటి
ఫైట్ మాస్టర్: అంజి మాస్టర్
కొరియోగ్రాఫర్: హరి కిరణ్ మాస్టర్
PRO: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- భారత్–యూఏఈ ఆవిష్కరణ రంగంలో కొత్త అడుగు..
- బాంబు బెదిరింపుల వేళ.. బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్‌తో కనిపించిన అమితాబ్
- హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర ప్రారంభం
- బహ్రెయిన్‌లో ప్రవాసులకు కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ నిబంధనలు..!!
- 2027 నుంచి యూఏఈలో కొత్త ట్రాఫిక్ రూల్స్..!!
- ఖతార్ లో 8 ప్రాంతాల్లో క్లీనప్ డ్రైవ్ షెడ్యూల్..!!
- కువైట్లోడిజిటల్ చెల్లింపుల వైపు ప్రజల మొగ్గు..!!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్ బ్రాంకో కార్ల రీకాల్..!!
- చైనా-ఒమన్ మధ్య కీలక ఒప్పందాలు..!!
- హార్ముజ్ జలసంధి తెరవడం పై ఇరాన్ కీలక ప్రకటన







