అక్రమమార్గంలో కిడ్నీలు విక్రయిస్తున్న వైద్యులు..

- August 09, 2016 , by Maagulf
అక్రమమార్గంలో  కిడ్నీలు విక్రయిస్తున్న వైద్యులు..

ముంబయిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో కిడ్నీ కుంభకోణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. ముంబయిలోని హిరనందని ఆస్పత్రిలో ఐదుగురు ఐదుగురు వైద్యులు, ఆసుపత్రి సీఈవో కిడ్నీ కుంభకోణంలో సూత్రధారులుగా పోలీసులు గుర్తించారు. ఈకేసులో ఇప్పటి వరకూ 12 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.వివరాల్లోకి వెళితే.. ఆసుపత్రి వైద్యులు నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి కీడ్నిలు విక్రయిస్తున్నట్లు పోలీసులు విచారణలో వెలుగు చూసింది. తాజాగా బ్రిజికిషోర్‌ అనే రోగికి నకిలీ ధ్రువీకరణ పత్రాలతో కిడ్నీ విక్రయించడంతో ఈ కుంభకోణం వెలుగు చూసింది. దీనికి సంబంధించి డా.సుజిత్‌ ఛటర్జీ(సీఈఓ), డా.అనురాగ్‌ నాయక్‌(మెడికల్‌ డైరక్టర్‌), డా.ముఖేష్‌ శెట్టి, డా.ముఖేష్‌ షా, డా.ప్రకాశ్‌ శెట్టిలపై కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం రాత్రి వారిని అరెస్టు చేశారు. నిందితులను బుధవారం కోర్టులో హాజరు పర్చనున్నట్లు పోలీసులు తెలిపారు. దేశంలో వేలాది మంది కిడ్నీబ బాధితులు ఉండగా.. కొందరు వైద్యులు అధిక ధరలకు అక్రమమార్గంలో కిడ్నీలు విక్రయిస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com