జాతీయ గీతాన్ని ఆలపించడంపై నిషేధం
- August 09, 2016
అత్యంత భక్తిశ్రద్ధలతో పాడుకోవాల్సిన జాతీయ గీతాన్ని ఆలపించడంపై నిషేధం విధించిన పాఠశాలను అధికారులు మూసేశారు. ఆ పాఠశాల విద్యార్థులను ఇతర పాఠశాలల్లో చేర్పించబోతున్నారు. జాతీయ గీతాన్ని పాడకూడదని ఎంఏ కాన్వెంట్ స్కూల్ మేనేజర్ జియా ఉల్ హక్ ఆదేశించారు. అందులోని 'భారత భాగ్యవిధాత' అనే పదాలు ఇస్లాంకు వ్యతిరేకమని జియా చెప్పారు. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. రెండు దశాబ్దాలుగా ఎటువంటి అధికారిక అనుబంధం లేకుండా ఈ పాఠశాల ఎలా నడుస్తోందో తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ గీతాన్ని పాడకూడదని నిషేధం విధించడంపై ఆ పాఠశాలలోని 8 మంది టీచర్లు రాజీనామా చేయడంతో ఈ స్కూలు వ్యవహారం బయటి ప్రపంచానికి తెలిసింది. వివిధ రంగాలకు చెందినవారు స్కూలు యాజమాన్యం జాతీయ గీతాన్ని నిషేధించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేరం రుజువైతే మూడేళ్ళ వరకు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







