అక్రమమార్గంలో కిడ్నీలు విక్రయిస్తున్న వైద్యులు..
- August 09, 2016
ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కిడ్నీ కుంభకోణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. ముంబయిలోని హిరనందని ఆస్పత్రిలో ఐదుగురు ఐదుగురు వైద్యులు, ఆసుపత్రి సీఈవో కిడ్నీ కుంభకోణంలో సూత్రధారులుగా పోలీసులు గుర్తించారు. ఈకేసులో ఇప్పటి వరకూ 12 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.వివరాల్లోకి వెళితే.. ఆసుపత్రి వైద్యులు నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి కీడ్నిలు విక్రయిస్తున్నట్లు పోలీసులు విచారణలో వెలుగు చూసింది. తాజాగా బ్రిజికిషోర్ అనే రోగికి నకిలీ ధ్రువీకరణ పత్రాలతో కిడ్నీ విక్రయించడంతో ఈ కుంభకోణం వెలుగు చూసింది. దీనికి సంబంధించి డా.సుజిత్ ఛటర్జీ(సీఈఓ), డా.అనురాగ్ నాయక్(మెడికల్ డైరక్టర్), డా.ముఖేష్ శెట్టి, డా.ముఖేష్ షా, డా.ప్రకాశ్ శెట్టిలపై కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం రాత్రి వారిని అరెస్టు చేశారు. నిందితులను బుధవారం కోర్టులో హాజరు పర్చనున్నట్లు పోలీసులు తెలిపారు. దేశంలో వేలాది మంది కిడ్నీబ బాధితులు ఉండగా.. కొందరు వైద్యులు అధిక ధరలకు అక్రమమార్గంలో కిడ్నీలు విక్రయిస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







