తమిళనాట నాలుగో స్థానంలో పెళ్ళిచూపులు.

- August 10, 2016 , by Maagulf
తమిళనాట నాలుగో స్థానంలో పెళ్ళిచూపులు.

తెలుగునాట పెద్ద హిట్ అయిన చిత్రం 'పెళ్ళిచూపులు'. మౌత్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరిస్తోంది. ఇక మన తెలుగువాళ్ల కోసం తమిళనాడులోనూ ఎంట్రీ ఇచ్చింది ఈ రిఫ్రెషింగ్ పిక్చర్. తమిళ్ సబ్ టైటిల్స్‌తో రన్ అవుతున్న ఈ సినిమాకు మంచి వసూళ్లే వస్తున్నాయి. కథ-కథనం బాగా నచ్చేయడంతో తమిళులూ 'ెళ్లి చూపులు'చూస్తున్నారట. కలెక్షన్ల పరంగా ఈ మూవీ తమిళనాట నాలుగో స్థానంలో నిలిచిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. రజనీకాంత్ 'బాలి'ఉన్న టాప్ ఫైవ్‌ గ్రూప్‌లో మన అచ్చ తెలుగు చిత్రం స్థానం దక్కించుకుంది. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమాకు ఊహించని విజయం దక్కడంతో చిత్రబృందం ఆనందంతో పొంగిపోతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com