కృష్ణా పుష్కరాలు కు సంపూకి ఆహ్వానం..
- August 10, 2016
హృదయ కాలేయం చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంపూర్ణేష్ బాబు ప్రస్తుతం అటు సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లోను ఇటు హీరోగాను రాణిస్తున్నాడు. సంపూ తాజాగా కొబ్బరిమట్ట అనే చిత్రంలో నటిస్తోండగా ఈ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. పెదరాయుడు, ఆండ్రాయిడ్, పాపారాయుడు అనే మూడు పాత్రలలో కనిపించనున్నాడు సంపూ. తాజాగా కొబ్బరి మట్ట ట్రైలర్‌ని విడుదల చేయగా, ఇందులో సంపూ చెప్పిన డైలాగ్‌కి ప్రేక్షకులు జేజేలు పలికారు. రోజు రోజుకి సంపూ క్రేజ్ మరింత పెరుగుతూ వస్తోంది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్న సంపూ తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఆహ్వానాన్ని అందుకున్నాడు. ఆగస్ట్ 12 నుండి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానుండగా ఈ పుష్కరాలకు ఆహ్వానిస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంపూకీ స్పెషల్ ఇన్విటేషన్ పంపింది. ఏపీ ప్రభుత్వం నుండి తనకు ఆహ్వానం రావడంతో సంపూ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తనకు వచ్చిన ఇన్విటేషన్‌ని ఫోటో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేసాడు ఈ బర్నింగ్ స్టార్.
తాజా వార్తలు
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్‌కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్‌లో భారత పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్‌లో భారత రాయబారి విపుల్‌కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?







