మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో ఈరోజు వరుస పేలుళ్లు..
- August 10, 2016
మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో ఈరోజు వరుస పేలుళ్లు సంభవించాయి. ఉదయం ఓ పేలుడు సంభవించగా.. ఇప్పుడు రెండోసారి బాంబు పేలింది. తాజాగా ఇంఫాల్‌లోని మణిపూర్ యూనివర్సిటీ గేట్ వద్ద బాంబు పేలింది. ఈ ఘటనలో ఎవరైనా గాయపడినదీ లేనిదీ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అంతకుముందు ఉదయం 9 గంటల ప్రాతంలో ఇంఫాల్ ఈస్ట్‌లోని బీఎస్ఎఫ్ క్యాంప్ సమీపంలో ఐఈడీ పేలడంతో ఏడేళ్ల బాలిక గాయపడింది. మోయిరాంగ్ పురెల్ గ్రామంలో ఈ పేలుడు జరిగిందని.. గాయపడిన పాపను ఇంఫాల్‌లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. పేలుళ్ల కారణంగా పోలీసులు, బీఎస్ఎఫ్ జవాన్లు మోహరించారు. భద్రతను పెంచి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పేలుళ్లకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!







