16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై బ్రిటన్ నిషేధం
- June 15, 2026
లండన్: పిల్లల మానసిక ఆరోగ్యం, ఆన్లైన్ భద్రతను దృష్టిలో ఉంచుకుని బ్రిటిష్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలందరి పై సోషల్ మీడియా వాడకాన్ని పూర్తిగా నిషేధించనున్నట్లు బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ సోమవారం అధికారికంగా ప్రకటించారు. డౌనింగ్ స్ట్రీట్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ, ఇది కేవలం సాధారణ మార్పు కాదని, డిజిటల్ యుగంలో సరికొత్త విప్లవమని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ఇప్పటికే అమలు చేస్తున్న నిబంధనల కంటే మరింత కఠినంగా ఉండేలా ఈ ‘ఆస్ట్రేలియా ప్లస్’ విధానాన్ని తీసుకువస్తున్నట్లు తెలిపారు. టిక్‌టాక్ (TikTok), ఇన్స్టాగ్రామ్ (Instagram), ఎక్స్ (X – ట్విట్టర్), యూట్యూబ్ (YouTube), ఫేస్బుక్ (Facebook), స్నాప్‌చాట్ (Snapchat) వంటి ప్రధాన సామాజిక మాధ్యమాలన్నీ ఈ నిషేధ పరిధిలోకి రానున్నాయి.
నిషేధానికి దారితీసిన ముఖ్య కారణాలు
టెక్ కంపెనీల వ్యాపార ప్రయోజనాల కంటే పిల్లల భద్రతే తమకు ముఖ్యమని బ్రిటిష్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిషేధానికి గల ప్రధాన కారణాలు:సోషల్ మీడియాలో ఉండే ‘ఇన్ఫినిట్ స్క్రోలింగ్’ ఫీచర్ వల్ల పిల్లలు గంటల తరబడి ఫోన్లకు అతుక్కుపోతున్నారు. సోషల్ మీడియా యాప్స్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు (Strangers) పిల్లలను ట్రాప్ చేసే ప్రమాదం పెరుగుతోంది.
గేమింగ్ యాప్స్ మరియు AI చాట్‌బాట్స్ పై కూడా ఆంక్షలు
కేవలం సోషల్ మీడియా మాత్రమే కాకుండా, 16 ఏళ్లలోపు పిల్లలు వాడే గేమింగ్ యాప్స్‌లో కూడా ‘అపరిచితులతో చాట్ చేసే’ ఆప్షన్‌ను తొలగించనున్నారు. అలాగే, 18 ఏళ్లలోపు ఉన్న మైనర్లు రాత్రి వేళల్లో ఆలస్యంగా ఫోన్లు స్క్రోలింగ్ చేయకుండా ఉండేందుకు ‘నైట్ కర్ఫ్యూ’ లాంటి ఫీచర్లను తీసుకురానున్నారు. అంతేకాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత రొమాంటిక్ లేదా సెక్సువల్ చాట్‌బాట్స్‌ను మైనర్లు యాక్సెస్ చేయకుండా పూర్తిగా బ్లాక్ చేయనున్నారు. ఈ చట్టాన్ని తీసుకురావడానికి ముందు బ్రిటిష్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. దీనికి దాదాపు 1,16,000 పైగా స్పందనలు రాగా, అందులో 90 శాతం మంది తల్లిదండ్రులు 16 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా నిషేధాన్ని గట్టిగా సమర్థించారు. తమ పిల్లలను హానికరమైన కంటెంట్ నుండి కాపాడుకోవడానికి ఈ చట్టం ఎంతో అవసరమని వారు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్‌పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!
- విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ వీసా.. కువైట్ కీలక నిర్ణయం
- సింగపూర్‌లో భారత హై కమిషనర్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!
- హెలికాప్టర్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ అలివర్ ట్రీ గాస్పి దుర్మరణం









