దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!
- June 15, 2026
మస్కట్: అనారోగ్య సమస్యల కారణంగా మరణించిన భారతీయ పౌరుడు నిశాంత్ ఉర్థనథన్ మృతదేహాన్ని, ఒమన్‌లోని దుక్మ్ ఓడరేవు వద్ద MT Celestial నౌక నుండి కిందకు దించి, ఆరోగ్య శాఖ ఆసుపత్రికి తరలించినట్లు మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు వీలుగా మృతుని కుటుంబ సభ్యులు మరియు ఒమన్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్టు వెల్లడించింది.
"శ్రీ నిశాంత్ ఉర్థనథన్ మృతదేహాన్ని దుక్మ్ ఓడరేవు వద్ద MT Celestial నౌక నుండి కిందకు దించి, దుక్మ్‌లోని ఆరోగ్య శాఖ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తరలించేందుకు మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం మృతుని కుటుంబం మరియు సంబంధిత ఒమన్ అధికారులతో కలిసి పనిచేస్తున్నారు." అని రాయబార కార్యాలయం 'X' వేదికగా ఒక ప్రకటనలో తెలిపింది.
భారతీయ నావికుడి మృతదేహాన్ని స్వదేశానికి తరలించే ప్రక్రియను వేగవంతం చేయడానికి మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం నౌక నిర్వహణ సంస్థ మరియు ఒమన్ అధికారులతో కలిసి పనిచేస్తోంది. దుక్మ్ ఓడరేవులో నిలిపి ఉంచిన MT Celestial నౌకలో ఉన్నప్పుడు అనారోగ్య సమస్యల కారణంగా నిశాంత్ ఉర్థనథన్ మరణించారు. నిశాంత్ ఉర్తనాథన్ భార్య సరబిన్, ఆయన పార్థివ దేహాన్ని స్వదేశానికి రప్పించాలని మరియు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
తాజా వార్తలు
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్‌పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!
- విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ వీసా.. కువైట్ కీలక నిర్ణయం
- సింగపూర్‌లో భారత హై కమిషనర్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!
- హెలికాప్టర్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ అలివర్ ట్రీ గాస్పి దుర్మరణం









