బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- June 15, 2026
మనామా: బహ్రెయిన్ నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా గుడ్ల ధరలలో భారీగా తేడాలు ఉన్నాయన్న ఫిర్యాదులు ఇటీవల పెరిగిన నేపథ్యంలో స్థానిక దుకాణాలలో తనిఖీలకు అధికారులు పిలుపునిచ్చారు. ఉత్తర మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు మహమ్మద్ సాద్ అల్ దోసెరి మాట్లాడుతూ.. ముఖ్యంగా నివాస సముదాయాలలో ఉన్న కిరాణా దుకాణాలలో పర్యవేక్షణను ముమ్మరం చేయాలని సంబంధిత అధికారులను కోరారు.
కుటుంబాలు తమ రోజువారీ అవసరాలను కొనుగోలు చేయడానికి ఈ దుకాణాలే ప్రధాన వనరు అని, అందువల్ల నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవడానికి క్రమం తప్పకుండా తనిఖీలు చాలా అవసరమని ఆయన తెలిపారు.
గుడ్ల ధరలలో గణనీయమైన వ్యత్యాసాలను అల్ దోసెరి ఎత్తిచూపారు. కొన్ని దుకాణాలు గుడ్లను BD2.700 లేదా BD2.200కు అమ్ముతుండగా, మరికొన్ని అదే ఉత్పత్తిని BD1.500 నుండి BD1.700 మధ్య అమ్ముతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ధరల వ్యత్యాసం వినియోగదారులలో ఆందోళనలను రేకెత్తిస్తోందన్నారు. గుడ్లు మరియు ఇతర నిత్యావసర ఆహార పదార్థాలలో ఇలాంటి ధరల వ్యత్యాసాలపై విస్తృతంగా తనిఖీలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
దుకాణం దారులు ధరల పారదర్శకత పాటించాలని, అమ్మకానికి అందుబాటులో ఉన్న అన్ని వస్తువులపై ధరలను స్పష్టంగా ప్రదర్శించాలని దుకాణాలను కోరారు. అలాగే, ధరలు, ఉత్పత్తి నాణ్యత మరియు వాణిజ్య ఉల్లంఘనలకు సంబంధించిన వినియోగదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించడానికి 24-గంటల హాట్‌లైన్‌ను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్‌పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!
- విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ వీసా.. కువైట్ కీలక నిర్ణయం
- సింగపూర్‌లో భారత హై కమిషనర్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!
- హెలికాప్టర్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ అలివర్ ట్రీ గాస్పి దుర్మరణం









