కువైట్ ఎయిర్ కార్గోలో డ్రగ్ స్మగ్లింగ్ ప్రయత్నం భగ్నం..!!

- June 18, 2026 , by Maagulf
కువైట్ ఎయిర్ కార్గోలో డ్రగ్ స్మగ్లింగ్ ప్రయత్నం భగ్నం..!!

కువైట్: హెయిర్ ఆయిల్స్ మరియు విడిభాగాలని ప్రకటించిన మూడు ఇన్‌బౌండ్ కంటైనర్లలో డ్రగ్స్ స్మగ్లింగ్ ప్రయత్నాన్ని కస్టమ్ అధికారులు భగ్నం చేశారు. ఒక యూరోపియన్ దేశం నుండి దేశంలోకి మాదకద్రవ్యాలను స్మగ్లింగ్ చేసే ప్రయత్నాన్ని ఎయిర్ కార్గో కస్టమ్స్ అధికారులు భగ్నం చేశారని కువైట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ ప్రకటించింది.

కస్టమ్స్ అధికారుల ప్రకటన ప్రకారం, కస్టమ్స్ క్లియరెన్స్ ప్రక్రియ సమయంలో సరుకులలోని వస్తువులపై ఇన్‌స్పెక్టర్లకు అనుమానం కలగడంతో వాటిని తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో వాటిల్లో దాచిపెట్టిన "కెమికల్" అని పిలవబడే మాదకద్రవ్య పదార్థంగా అనుమానిస్తున్న సుమారు ఐదు కిలోగ్రాముల ద్రవం వాటిలో గుర్తించారు. అన్ని కస్టమ్స్ పోర్టులలో పర్యవేక్షణను కఠినతరం చేయడానికి మరియు నిషేధిత పదార్థాల స్మగ్లింగ్ ప్రయత్నాలను ఎదుర్కోవడానికి తాము కట్టుబడి ఉన్నామని కస్టమ్స్ అధికారులు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com