డొమెస్టిక్ వర్కర్ పర్మిట్ సర్వీస్ అప్డేట్: LMRA

- June 18, 2026 , by Maagulf
డొమెస్టిక్ వర్కర్ పర్మిట్ సర్వీస్ అప్డేట్: LMRA

మనామా: ప్రభుత్వ సేవలను మెరుగుపరిచే ప్రయత్నాలలో భాగంగా.. యజమానులు మరణించిన డొమెస్టిక్ వర్కర్స్ వర్క్ పర్మిట్ స్టేటస్ ను సరిచేయడానికి ఉద్దేశించిన తన సర్వీస్ ను లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) అప్డేట్ చేసింది.

ఈ అప్డేట్ డిజిటల్ సర్వీస్ ద్వారా కార్మికులు వేరొక యజమాని కింద కొత్త వర్క్ అనుమతిని పొందవచ్చు లేదా బహ్రెయిన్ విడిచి వెళ్ళడానికి ఉన్న అనుమతిని రద్దు చేసుకోవచ్చని తెలిపింది. ప్రాసెసింగ్ సమయం 10 పనిదినాల నుండి ఒక రోజుకు తగ్గిందని..  అదే సమయంలో అవసరమైన పత్రాలు 50% మరియు ఆమోదాలు 25% తగ్గించినట్లు పేర్కొంది.  దీంతో వేగం మరియు సామర్థ్యం మెరుగుపడినట్లు LMRA వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com