ఖతార్‌లో డిజిటల్ చైల్డ్ ప్రొటెక్షన్ చట్టంపై కేబినెట్ రివ్యూ..!!
- June 18, 2026
దోహా: ఖతార్ లో పిల్లల డిజిటల్ రక్షణపై ముసాయిదా చట్టం కోసం షురా కౌన్సిల్ నుండి వచ్చిన ప్రతిపాదనను క్యాబినెట్ సమీక్షించింది. ఈ ప్రతిపాదిత చట్టం ప్రకారం.. 16 ఏళ్లలోపు వ్యక్తులు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించడాన్ని నియంత్రించడం మరియు ఆన్లైన్ ప్రమాదాల నుండి రక్షణ కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. తదుపరి అధ్యయనం కోసం ముసాయిదాను సంబంధిత అధికారులకు పంపించారు.
ఉప ప్రధాన మంత్రి మరియు రక్షణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి షేక్ సౌద్ బిన్ అబ్దుల్‌రెహ్మాన్ బిన్ హసన్ అల్-థానీ అధ్యక్షతన దోహాలోని అమీరీ దివాన్లో కేబినెట్ సమావేశం జరిగింది. ఫ్రాన్స్‌లో జరిగిన G7 శిఖరాగ్ర సమావేశంలో అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ పాల్గొనడాన్ని స్వాగతించారు. ఎవియన్-లెస్-బైన్స్ (Evian-les-Bains)లో జరిగిన శిఖరాగ్ర సమావేశానికి అమీర్ హాజరుకావడాన్ని మంత్రులు ప్రశంసించారు. అలాగే, ఆ సమావేశం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆయన జరిపిన చర్చలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.
అమెరికా మరియు ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందానికి సంబంధించి కుదిరిన ఇటీవలి ఒప్పందాన్ని కూడా ఖతార్ స్వాగతించింది. సంఘర్షణకు ముగింపు పలకడం, హార్ముజ్ జలసంధి గుండా నౌకాయాన స్వేచ్ఛను కాపాడటం మరియు ప్రాంతీయ, అంతర్జాతీయ స్థిరత్వానికి మద్దతు ఇవ్వడం దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగు అని మంత్రివర్గం అభివర్ణించింది.
ఇదిలా ఉండగా, 2026 గ్లోబల్ పీస్ ఇండెక్స్‌లో మిడిలీస్టు మరియు ఉత్తర ఆఫ్రికాలో అత్యంత శాంతియుత దేశంగా ఖతార్ నిలవడాన్ని క్యాబినెట్ స్వాగతించింది.
తాజా వార్తలు
- అమెరికాలో 11 ఏళ్ల తెలుగు బాలిక అద్భుత ఘనత..
- కరీంనగర్లో మినిస్టర్ వైట్ షోరూమ్ ప్రారంభం
- ఖతార్‌లో డిజిటల్ చైల్డ్ ప్రొటెక్షన్ చట్టంపై కేబినెట్ రివ్యూ..!!
- కొత్తగా స్థాపించిన వ్యాపారాలకు వీసాలు తగ్గించిన సౌదీ..!!
- డొమెస్టిక్ వర్కర్ పర్మిట్ సర్వీస్ అప్డేట్: LMRA
- అల్ జబల్ అల్ అఖ్దర్ ఫెస్టివల్ 2026.. వివరాలు వెల్లడి..!!
- కువైట్ ఎయిర్ కార్గోలో డ్రగ్ స్మగ్లింగ్ ప్రయత్నం భగ్నం..!!
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్‌లోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్‌లో అద్భుతమైన ఫీచర్..









