కరీంనగర్లో మినిస్టర్ వైట్ షోరూమ్ ప్రారంభం
- June 18, 2026
ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్
కరీంనగర్: కరీంనగర్ పట్టణంలోని అంబేద్కర్ కోర్టు చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన మినిస్టర్ వైట్ షోరూమ్‌ను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంయుక్తంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా షోరూమ్‌ను పరిశీలించిన మంత్రులు, ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన వ్యాపార సంస్థ యాజమాన్యాన్ని అభినందించారు. స్థానికంగా ఉపాధి అవకాశాల కల్పనతో పాటు వ్యాపారాభివృద్ధికి ఇటువంటి సంస్థలు దోహదపడతాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్, ఆర్టీఏ సభ్యులు పడాల రాహుల్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, వ్యాపారవేత్తలు మరియు స్థానికులు పాల్గొన్నారు.
మినిస్టర్ వైట్ షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రులు మరియు ప్రజాప్రతినిధులు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసి, సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
--నారాయణ గుళ్ళపల్లి(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- హైదరాబాద్ లో గన్ తో కానిస్టేబుల్ హాల్ చల్
- కార్లలో పిల్లలను ఒంటరిగా వదిలేస్తే భారీ జరిమానా, జైలు శిక్ష
- అమెరికాలో 11 ఏళ్ల తెలుగు బాలిక అద్భుత ఘనత..
- కరీంనగర్లో మినిస్టర్ వైట్ షోరూమ్ ప్రారంభం
- ఖతార్‌లో డిజిటల్ చైల్డ్ ప్రొటెక్షన్ చట్టంపై కేబినెట్ రివ్యూ..!!
- కొత్తగా స్థాపించిన వ్యాపారాలకు వీసాలు తగ్గించిన సౌదీ..!!
- డొమెస్టిక్ వర్కర్ పర్మిట్ సర్వీస్ అప్డేట్: LMRA
- అల్ జబల్ అల్ అఖ్దర్ ఫెస్టివల్ 2026.. వివరాలు వెల్లడి..!!
- కువైట్ ఎయిర్ కార్గోలో డ్రగ్ స్మగ్లింగ్ ప్రయత్నం భగ్నం..!!
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్‌లోని భవనంలో అగ్నిప్రమాదం..!!









