మిలన్లో ఒమన్-ఇటలీ కల్చరల్ ఎక్స్ పో ప్రారంభం..!!
- June 19, 2026
మిలన్: ఇటలీలోని మిలన్లో ఉన్న ప్రతిష్టాత్మక పినాకోటెకా డి బ్రెరాలో నేషనల్ మ్యూజియం 'ఒమన్ మరియు ఇటలీ: టూ మిలేనియా ఆఫ్ క్రాస్-సివిలైజేషన్ డైలాగ్ 'ను ప్రారంభించింది. ఈ ఎక్స్ పో ట్రేడ్, నాలెడ్జ్ మరియు సాంస్కృతిక మార్పిడిలో శక్తివంతమైన నెట్‌వర్క్‌ల ద్వారా దాదాపు రెండు సహస్రాబ్దాలుగా ఒమన్ మరియు ఇటలీలను అనుసంధానించిన చారిత్రక సంబంధాలను తెలియజేస్తుంది. పురావస్తు ఆవిష్కరణలు, యాత్రా సాహిత్యం, కార్టోగ్రఫీ మరియు కళల ఆధారంగా మధ్యధరా మరియు హిందూ మహాసముద్రాల మీదుగా ఉన్న ఉమ్మడి నాగరికతా వారసత్వాన్ని చాటిచెప్పనుంది.
ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇటలీలోని ఒమన్ రాయబారి హెచ్‌హెచ్ సయ్యద్ నిజార్ బిన్ అల్ జులంద అల్ సయీద్, నేషనల్ మ్యూజియం సెక్రటరీ-జనరల్ జమాల్ బిన్ హసన్ అల్ మౌసావి, ఇటలీకి చెందిన పలువురు అధికారులు హాజరయ్యారు.
ఈ ఎక్స్ పో లోని అత్యంత ముఖ్యమైన కళాఖండాలలో అల్ హమ్రా విలాయత్‌లోని సైహ్ అల్ ఖా వద్ద కనుగొన్న కంచు సర్ప విగ్రహం మరియు సలూత్ పురావస్తు ప్రదేశం నుండి లభించిన మట్టిపాత్రల శకలాలు ఉన్నాయి. వీటితో పాటు మసిరా ద్వీపంలో బయటపడిన రోమన్ ఇటాలియన్ మూలానికి చెందిన రెండు సర్ప ఆకారపు పాత్రల పిడులు కూడా ప్రదర్శనలో ఆకట్టుకోనున్నాయి. సమ్హరం అనే ప్రాచీన ఓడరేవు నుండి లభించిన పాత దక్షిణ అరేబియా (హధ్రమిటిక్) శాసనంతో కూడిన ఒక ఫలకం, ప్రాచీన కాలంలో సాంబ్రాణికి ఉన్న ఉన్నత స్థానాన్ని చాటిచెప్పే పరికరాలు ఉన్నాయి. ఇక అరుదైన రాతప్రతులలో జాంజిబార్‌లో ముద్రించబడిన 'డైజెస్ట్ ఆఫ్ లాస్' (బయాన్ అష్ షర్) మరియు 'డిక్షనరీ ఆఫ్ ఇస్లామిక్ లా' (ఖమూస్ అష్ షరీయా)తో పాటు ప్రాచీన ఖురాన్ రాతప్రతులు మరియు పవిత్ర ఖురాన్ అర్థాల స్వాహిలీ అనువాదం కూడా ఉన్నాయని నేషనల్ మ్యూజియం ప్రతినిధులు తెలిపారు.
తాజా వార్తలు
- సూక్ వాకిఫ్ లో 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' ప్రారంభం..!!
- సోషల్ మీడియా బ్యాన్: స్క్రోలింగ్ చేస్తూ నిద్ర, భోజనం మానేస్తున్న పిల్లలు..!!
- కొన్ని వారాల్లోనే చమురు ఉత్పత్తి పునరుద్ధణ..!!
- మానవ అక్రమ రవాణా కేసులో మహిళకు ఏడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీలో 65% మంది పిల్లలు అనుచితమైన కంటెంట్‌కు గురవుతున్నారు..!!
- మిలన్లో ఒమన్-ఇటలీ కల్చరల్ ఎక్స్ పో ప్రారంభం..!!
- ఇరాన్ శాంతి ఒప్పందం..అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర విభేదాలు
- టెలిగ్రామ్ పై కేంద్రం విధించిన నిషేధాన్ని సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు
- TOMCOM ఆధ్వర్యంలో ఇజ్రాయెల్‌లో కేర్ గివర్స్‌కు భారీ ఉద్యోగ అవకాశాలు
- ఫాస్ట్ ట్రాక్ పై అమెరికా వీసా ఛాన్స్..కానీ భారీ ఖర్చు!







