ఖతార్ బహుమతిగా ఇచ్చిన 'ఎయిర్ ఫోర్స్ వన్' టెస్టింగ్ పూర్తి..!!
- June 20, 2026
దోహా: గత ఏడాది ఖతార్ బహుమతిగా ఇచ్చిన కొత్త అమెరికా అధ్యక్ష విమానం పరీక్షలను (flight testing) పూర్తి చేసుకుందని, ఈ సమ్మర్ లో ప్రజల ముందుకు తీసుకురావడానికి (rollout) సిద్ధమవుతోందని అమెరికా వైమానిక దళం ప్రకటించింది.
వైమానిక దళానికి చెందిన VC-25B 'బ్రిడ్జ్' విమానం మార్పులు మరియు విమాన పరీక్షలు అధికారికంగా పూర్తయ్యాయి. ప్రస్తుతం దీనికి పెయింటింగ్ ప్రక్రియ జరుగుతోందన్నారు. ఈ సమ్మర్ లో రెడ్, వైట్ మరియు బ్లూ కలర్స్ తో కొత్త అలంకరణతో (livery) ఈ విమానం బయటకు రావడానికి ప్రణాళికాబద్ధంగా సిద్ధమవుతోంది" అని అమెరికా వైమానిక దళం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ప్రాజెక్ట్‌ను పర్యవేక్షిస్తున్న జనరల్ డేల్ వైట్ మాట్లాడుతూ.. ఈ జెట్ విమానం లోపలి భాగంలో (interior) పెద్దగా మార్పులేమీ చేయలేదని చెప్పారు.
2003 తర్వాత తొలిసారిగా ఒక అమెరికా అధ్యక్షుడు ఖతార్‌ను సందర్శించడం, మొదటిసారి. గల్ఫ్ ప్రాంత పర్యటనలో భాగంగా దోహాకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఖతార్ ఈ బోయింగ్ 747 విమానాన్ని బహుమతిగా ఇచ్చింది. ఖతార్‌లో ఆయన పర్యటన సందర్భంగా దోహా మరియు వాషింగ్టన్ మధ్య కనీసం 1.2 ట్రిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు కుదిరాయి. తాను ఉపయోగిస్తున్న విమానాలు పాతదని ట్రంప్ పేర్కొన్నారు .
ప్రస్తుతం వాడుకలో ఉన్న 'ఎయిర్ ఫోర్స్ వన్' విమానాల శ్రేణి (fleet) కూడా బోయింగ్ 747 రకానికి చెందినవే. ఇవి దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం, అంటే అధ్యక్షుడు జార్జ్ హెచ్.డబ్ల్యూ. బుష్ హయాం నాటివి. 1953లో డ్వైట్ ఐసెన్‌హోవర్ ప్రయాణిస్తున్న అధ్యక్ష విమానం, అదే గుర్తింపు సంఖ్య గల ఒక వాణిజ్య విమానం ప్రయాణిస్తున్న గగనతలంలోకి ప్రవేశించడంతో, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు గందరగోళం ఏర్పడింది. ఆ తర్వాత "ఎయిర్ ఫోర్స్ వన్" అనే కాల్ సైన్‌ను మొదటిసారిగా అనధికారికంగా ఉపయోగించారు. 1962లో దీనిని అధికారికంగా స్వీకరించారు. అదే సంవత్సరం అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీ, ప్రత్యేకంగా అధ్యక్షుల ఉపయోగం కోసం నిర్మించిన జెట్‌లో ప్రయాణించిన మొదటి యు.ఎస్. అధ్యక్షుడిగా నిలిచారు.
తాజా వార్తలు
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు
- ఖతార్‌లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- హర్మూజ్ జలసంధి మూసివేతతో భారీగా పెరిగిన చమురు ధరలు
- రూ.50 లక్షలకోసం భర్త కిడ్నాప్ డ్రామా!
- యూఏఈలో మూడు రోజులపాటు రెయిన్ అలెర్ట్..!!
- సాయికృష్ణ మిస్సింగ్ కేసు..నేడు కోర్టుకు ఆధారాలు
- గల్ఫ్ కార్మికుల ఓటు హక్కుల పై మంత్రి పొన్నం ప్రభాకర్‌తో చర్చ
- దుబాయ్‌లో బ్యాడ్మింటన్ ఆడుతూ భారతీయ ప్రవాసి మృతి..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌లో బొంగో సంస్కృతి బహ్రెయిన్ రక్తదాన శిబిరం..!!
- ఫోర్బ్స్ టాప్ 100లో ఆరు కువైట్ ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్ కు చోటు..!!







