మచిలీపట్నం బస్‌స్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: ఎంపీ బాలశౌరి

- June 20, 2026 , by Maagulf
మచిలీపట్నం బస్‌స్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం: మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి నేడు మచిలీపట్నం ఆర్టీసీ బస్‌స్టాండ్‌ను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.స్వల్ప వర్షానికే బస్‌స్టాండ్ ప్రాంగణం నీట మునిగిపోవడం, పారిశుధ్య లోపాలు, మౌలిక వసతుల కొరత కారణంగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన ప్రత్యక్షంగా గమనించారు.

ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో మేనేజర్‌ను బస్‌స్టాండ్ ప్రస్తుత పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్న ఎంపీ, బస్‌స్టాండ్ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపొందించి సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు.ఎంపీ నిధులు మరియు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధుల ద్వారా బస్‌స్టాండ్‌ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రతి బస్‌స్టాండ్‌ను దశలవారీగా అభివృద్ధి చేసి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం తన బాధ్యతగా భావిస్తున్నానని బాలశౌరి పేర్కొన్నారు. బస్‌స్టాండ్‌లో బస్సుల కోసం వేచి ఉన్న ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్, జనసేన పార్టీ నాయకులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com