అబుదాబీలో అగ్ని ప్రమాదం: 3 షాపుల దగ్ధం

- August 10, 2016 , by Maagulf
అబుదాబీలో అగ్ని ప్రమాదం: 3 షాపుల దగ్ధం

మూడు షాపులు పూర్తిగా దగ్ధమైన ఘటన అబుదాబీలో చోటుచేసుకుంది. బనియాస్‌ డౌన్‌ టౌన్‌లోని బనియాస్‌ కో ఆపరేటివ్‌ బిల్డింగ్‌లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటన గురించి తెలియగానే అబుదాబీ సివిల్‌ డిఫెన్స్‌, ప్రమాద స్థలికి చేరుకుని, మంటల్ని ఆర్పివేసింది. అయితే అప్పటికే పూర్తిగా ఆ షాపులు దగ్ధమయ్యాయి. మిగతా షాపులకు మంటలు వ్యాపించకుండా చేయగలిగారు సివిల్‌ డిఫెన్స్‌ సిబ్బంది. షాప్‌ల యజమానులు, అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వేసవి కారణంగా ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని, షార్ట్‌ సర్క్యూట్స్‌ వల్లనే ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతాయి గనుక, వాటి విషయంలో ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com