అక్రమంగా బంగారం తరలిస్తున్న పైలట్‌ను అధికారులు అదుపులోకి..

- August 11, 2016 , by Maagulf
అక్రమంగా బంగారం తరలిస్తున్న పైలట్‌ను  అధికారులు అదుపులోకి..

 అక్రమంగా బంగారం తరలిస్తున్న పైలట్‌ను ముంబై ఎయిర్‌పోర్టు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జెడ్డా నుంచి ముంబైకు చేరుకున్న ఎయిర్‌ఇండియా విమానంలో పైలట్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో అధికారులు అతనిపై నిఘా పెట్టారు. పైలట్ బ్యాగ్‌ను తనిఖీ చేయగా అరకిలో బంగారం బయటపడింది. దాని విలువ దాదాపు రూ.15లక్షలుగా తెలుస్తోంది. వెంటనే పైలెట్‌ అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com