20 నకిలీ కువైట్ పౌరసత్వాలు రద్దు
- August 11, 2016
మనామా: నకిలీ పౌరసత్వ ధరకాస్తులతో మోసగించినట్లు నిర్ధారింపబడటంతో కువైట్ స్వదేశస్గులుగా పరిగణించబడుతున్న 20 మంది అక్రమ కువైటీయులని పరిశోధనలు అనంతరం వారి జాతీయతను తొలగించినట్లు అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. వీరిలో 19 మంది పురుషులు మరియు ఒక మహిళ తమ జాతీయతని గుట్టుగా దాచిపెట్టినట్లు సమాచారం కువైట్ పౌరసత్వం చట్టం ప్రకారం ఎవరైనా దరఖాస్తుదారుడు తప్పుడు సమాచారం లేదా నకిలీ సర్టిఫికేట్లు అందించినట్లుగా నిర్ధారణ కాబడితే వారి జాతీయతఉపసంహరించబడుతుంది. అప్లికేషన్లు తనిఖీ సమయంలో ఒక పురుషుని మరియు స్త్రీ సంబంధించిన పుట్టిన తేదీలు పై దృష్టి సారించిన అధికారులు వాటిని తప్పుగా ఒకో చోట ఒకో విధంగా చూపడంతో ఈ నకిలీ పౌరసత్వాల గుట్టు రట్టయింది. అంతర్గత మంత్రి నుండి ఒక అభ్యర్థన ఆధారంగా వారి పౌరసత్వాలను రద్దు చేయాలని కేబినెట్ కు ఆదేశించారు.కువైట్ భద్రతా అధికారులు ఇటీవల కువైట్ జాతీయత పొందటానికి పలువురు సామాజిక మరియు ఆర్ధిక ప్రయోజనాలు నుండి పొందేందుకు నకిలీ పౌరసత్వాలను ఆశ్రయిస్తున్నారు. అధికారులు ఈ విషయంలో శ్రద్ధగా పరిశీలించడంతో పలువురు అక్రమార్కులు దొరుకుతున్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







