మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!

- June 27, 2026 , by Maagulf
మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!

దోహా: రాస్ లఫ్ఫాన్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మరో ఎనిమిది మంది భారతీయుల మృతదేహాలను భారత్ కు తరలించారు. ఈ మేరకు దోహాలోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనలో మరణించిన మొత్తం 12 మంది భారతీయులలో నలుగురి మృతదేహాలను జూన్ 25న స్వదేశానికి తరలించారు. 

ఈ సందర్భంగా సాయం అందించిన ఖతార్ అధికారులు, భారతీయ కమ్యూనిటీ సంఘాలు మరియు భారత ప్రభుత్వ అధికారులకు రాయబార కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది.  

అలాగే, భారత రాయబారి విపుల్ మరియు రాయబార కార్యాలయ అధికారులు అల్-ఖోర్‌లో గాయపడి చికిత్స పొందుతున్న కొందరు భారతీయులను కలిశారని తెలిపింది.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com