సమ్మర్ వర్కింగ్ అవర్స్ వయోలేషన్ రిపోర్టుకు ప్రత్యేక ఛానెల్స్..!!

- June 29, 2026 , by Maagulf
సమ్మర్ వర్కింగ్ అవర్స్ వయోలేషన్ రిపోర్టుకు ప్రత్యేక ఛానెల్స్..!!

దోహా: వేసవి కాలంలో పని వేళలకు సంబంధించిన నిబంధనలు మరియు భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలను నివేదించడానికి కార్మిక మంత్రిత్వ శాఖ (MoL) అనేక మార్గాలను అందుబాటులోకి తెచ్చింది. కార్మికులను అధిక ఉష్ణోగ్రతల వల్ల కలిగే అనారోగ్య సమస్యల (heat stress) నుండి రక్షించడం మరియు కార్మిక నిబంధనల అమలు ప్రధాన లక్ష్యమన్నారు.

నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదులను ప్రత్యేక హాట్‌లైన్ నంబర్ 40488264 ద్వారా లేదా [email protected] ఈమెయిల్ ద్వారా సమర్పించవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి, నిబంధనలను పాటించని యజమానులపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేసింది. 

అధిక ఉష్ణోగ్రతల వల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన పెంచడం మరియు పని ప్రదేశాలలో నివారణ చర్యల పాటించడాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా.. ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలోని అనేక భాగస్వాముల సహకారంతో మంత్రిత్వ శాఖ ప్రారంభించిన హీట్ స్ట్రెస్ క్యాంపెయిన్ 2026 ప్రారంభోత్సవంతో పాటుగా కార్మిక మంత్రిత్వ శాఖ పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com