కువైట్ లో అనధికార వాహన స్టిక్కర్లపై హెచ్చరిక..!!
- July 01, 2026
కువైట్: వాహనాల బాడీలు లేదా కిటికీలపై అనధికారిక స్టిక్కర్లు, రాతలు లేదా చిత్రాలతో అలంకరించవద్దని కువైట్ ట్రాఫిక్ విభాగం హెచ్చరిక జారీ చేసింది. గ్రాడ్యుయేట్స్ వేడుకల వంటి సామాజిక కార్యక్రమాల సమయంలో సర్వసాధారణంగా కనిపించే ఈ పద్ధతులను ఈ నోటీసులో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఇటువంటి మార్పులు ట్రాఫిక్ నిబంధనలకు వ్యతిరేకమని తెలిపారు. ఇలాంటి ఉల్లంఘనలకు జరిమానాలు విధించడంతోపాటు వాహనాన్ని స్వాధీనం చేసుకొని, జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని పేర్కొంది. వాహన ప్రమాణాలను మరియు రహదారి భద్రతను పరిరక్షించే చట్టాలను పాటించాలని కోరింది. బాధ్యతాయుతంగా ఆయా వేడులకను జరుపుకోవాలని అధికారులు డ్రైవర్లకు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!
- కువైట్ లో అనధికార వాహన స్టిక్కర్లపై హెచ్చరిక..!!
- సౌక్ వాకిఫ్లో మ్యాంగో ఫెస్టివల్ పునఃప్రారంభం..!!
- రాస్ అల్ ఖైమాలో విషాదం..పరీక్షలకు వెళ్తుండగా టీనేజర్ మృతి..!!
- బహ్రెయిన్ లో భద్రతా తనిఖీల వీడియో చిత్రీకరణ..వ్యక్తి అరెస్ట్..!!







