తమిళనాడు గవర్నర్‌గా శంకరమూర్తి..!

- August 12, 2016 , by Maagulf
తమిళనాడు గవర్నర్‌గా శంకరమూర్తి..!

తమిళనాడు గవర్నర్‌గా బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక శాసన మండలి చైర్మన్ డీహెచ్ శంకరమూర్తి నియమితులయ్యే అవకాశం ఉంది. శంకరమూర్తి నామినేషన్‌ను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సిఫారసు చేయడంతో దానిని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. తమిళనాడు ప్రస్తుత గవర్నర్ రోశయ్య పదవీకాలం ఈనెల 30వ తేదీతో ముగియనుంది. దీంతో ఆయన స్థానంలో గవర్నర్ నియామకం మరో మూడు రోజుల్లో ఖరారు చేయనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన రాజకీయవేత్త అయిన శంకరమూర్తి 1988లో సౌత్ వెస్ట్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎన్నికయ్యారు. అనంతరం 1994, 2000, 2006లో వరుసగా మూడుసార్లు ఆయన కౌన్సిల్‍కు ఎన్నకయ్యారు. బీజేపీలో చురుకైన నాయకుడుగా పేరున్న ఆయన 'బంగ్లా సత్యాగ్రహ'లో పాల్గొని తీహార్ జైలుకు వెళ్లారు. 1975 ఎమర్జెన్సీలో 'మిసా' కింద అరెస్టై బెల్గవాయ్ జైలులో 19 నెలల పాటు జైలుజీవితం గడిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com