ప్రత్యేక స్టాంపును విడుదల చేయనున్న ఐక్యరాజ్యసమితి
- August 12, 2016
ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బులక్ష్మి గౌరవార్థం ఆమె శతజయంతిని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక స్టాంపును విడుదల చేయనుంది. ఐరాస ప్రధాన కార్యలయంలో వచ్చేవారం భారత స్వాంతంత్య్ర వేడుకలు జరగనున్నాయి. వీటితో పాటు సుబ్బులక్ష్మి శతజయంతి ఉత్సవాలను కూడా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఎంఎస్ సుబ్బులక్ష్మి స్మారక స్టాంపులను విడుదల చేయనున్నట్లు ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి బృందం తెలిపింది.ఆగస్టు 15న భారత 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐరాసలో వేడుకలు నిర్వహించనున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీతకారుడు ఏఆర్ రెహమాన్ ఈ వేడుకల్లో సంగీత కచేరీ చేయనున్నారు. ఐరాస హాల్లో సంగీత ప్రదర్శన ఇస్తున్న రెండో భారతీయుడు రెహమాన్. ఇక్కడ ప్రదర్శన ఇచ్చిన తొలి భారత కళాకారిణి ఎంఎస్ సుబ్బులక్ష్మి అన్న సంగతి తెలిసిందే.ఐరాసలో కచేరీ నిర్వహించేందుకు 1966 అక్టోబర్లో అప్పటి యూఎన్ జనరల్ సెక్రటరీ యు థాంట్.. సుబ్బులక్ష్మిని ఆహ్వానించారు. ఈ ఏడాదితో సుబ్బులక్ష్మి ప్రదర్శనకు 50ఏళ్లు పూర్తవనున్నాయి. కాగా.. ఇదే సంవత్సరం ఆమె శతజయంతి సంవత్సరం కూడా అయిన నేపథ్యంలో ఐరాసలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది భారత బృందం. ఆగస్టు 15 నుంచి 19 వరకు ఆమె అరుదైన చిత్రాలతో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటుచేసింది. 1916 సెప్టెంబర్ 16న సుబ్బులక్ష్మి జన్మించారు.
తాజా వార్తలు
- రైళ్లలో అదనపు లగేజీ పై ఛార్జీలు
- విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్..
- దుబాయ్లో బహ్రెయిన్ ప్రయాణికులకు అరుదైన స్వాగతం..!!
- హ్యాకింగ్, ఆర్థిక మోసాల దారితీసే నకిలీ QR కోడ్లు..!!
- కువైట్ లో పాదచారుల భద్రతకు ప్రతిపాదనలు..!!
- ఖతార్ లోఆరోగ్య కేంద్రాల పనివేళలల్లో మార్పులు..!!
- సౌదీలో కార్మికుల పై ప్రవాస రుసుము రద్దు..!!
- ఒమన్, భారత్ మధ్య కీలక అవగాహన ఒప్పందాలు..!!
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ







