ఆన్‌లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!

- July 04, 2026 , by Maagulf
ఆన్‌లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!

మనామాః బహ్రెయిన్ లో ఆన్‌లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష విధించారు. నకిలీ ట్రాఫిక్ ఉల్లంఘన మెసేజుల ద్వారా బాధితులకు 1,800 బహ్రెయిన్ దినార్లకు పైగా నష్టాన్ని కలిగించిన ఆన్‌లైన్ ఫ్రాడ్ పథకంలో దోషులుగా తేలిన ముగ్గురు ఆసియా జాతీయులకు విధించిన ఐదేళ్ల జైలు శిక్షను అప్పీల్ కోర్టు సమర్థించింది. కోర్టు ప్రతి నిందితుడిపై 3,000 బహ్రెయిన్ దినార్ల జరిమానా, రెండవ మరియు మూడవ నిందితులపై అదనపు జరిమానాలు, మరియు శిక్షాకాలం పూర్తయ్యాక వారిని శాశ్వత బహిష్కరించాలని కోర్టు తీర్పును వెలువరించింది.

నిందితులు సిమ్ కార్డులను ఉపయోగించి, బాధితులను నకిలీ చెల్లింపు లింక్‌లకు మళ్లించే మోసపూరిత సందేశాలను పంపి, వారి బ్యాంకు ఖాతాల నుండి అనధికారికంగా డబ్బు విత్‌డ్రా చేసేలా చేశారని దర్యాప్తులో వెల్లడైంది. దొంగిలించిన నిధులను బహ్రెయిన్‌లో మొబైల్ ఫోన్లు కొనడానికి ఉపయోగించారు. ఈ కేసులో ఒక వ్యవస్థీకృత సైబర్ మోసాల నెట్‌వర్క్ ప్రమేయం ఉందని అధికారులు వెల్లడించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com