ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- July 04, 2026
కువైట్: కువైట్ లో వలస కార్మికుల ఉద్యోగ మార్పిడిపై ఉన్న నిషేధాన్ని రెండు నెలల పాటు సడలించారు. దీంతో 27,000 మందికి పైగా కార్మికులు ప్రయోజనం పొందారని 'పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్‌పవర్' (PAM) తెలిపింది. ఈ సడలింపు గడువు జూన్ 30తో ముగిసింది. కార్మిక నిబంధనల ప్రకారం, ఆర్థిక వ్యవస్థలోని కొన్ని రంగాలు విదేశాల నుండి కార్మికులను నియమించుకోవడానికి అనుమతి కలిగి ఉన్నప్పటికీ, ఆ కార్మికులు తమ నిర్దిష్ట రంగాల పరిధి దాటి ఇతర ఉద్యోగాలకు మారడంపై నిషేధం ఉండేది. స్థానిక కార్మిక మార్కెట్ అత్యవసర అవసరాల నేపథ్యంలో PAM ఈ నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేసింది.
ఇక ప్రయోజనం పొందిన వారిలో 16,048 మంది చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల రంగానికి చెందినవారని, ఆ తర్వాతి స్థానాల్లో వ్యవసాయ రంగం (4,460 మంది కార్మికులు) మరియు పారిశ్రామిక రంగం (3,300 మంది) ఉన్నాయని పేర్కొన్నారు. ఉద్యోగాలు మారిన మిగిలిన 3,333 మంది కార్మికులు గొర్రెల పెంపకం మరియు మత్స్య రంగాలకు చెందినవారని తెలిపారు. మార్కెట్ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో మరియు దాని నిర్వహణ స్థిరత్వాన్ని పెంపొందించడంలో ఈ నిషేధం సహాయపడుతుందని పబ్లిక్ అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







