మా టీవీకి షాక్.!
- August 12, 2016ప్రముఖ తెలుగు ఎంటర్ టైన్మెంట్ ఛానల్ మాటీవీ నెట్వర్క్ కు కేంద్రం ఝలక్ ఇచ్చింది. మా టీవీ, మాగోల్డ్, మా మూవీస్, మా మ్యూజిక్ చానళ్లకు లైసెన్స్‌లను రద్దు చేసింది. తాజాగా రెన్యువల్ చేసిన లైసెన్స్‌ల జాబితా నుంచి మా టీవీ నెట్ వర్క్ కు చెందిన ఈ నాలుగు చానెల్స్‌ను కేంద్రం తొలగించింది.
మా సంస్థ డైరెక్టర్‌పై ఉన్న ఆర్థిక నేరాల అభియోగాల కారణంతో క్లియరెన్స్‌ను హోంశాఖ సెక్యూరిటీ నిరాకరించింది. ప్రసారమంత్రిత్వ శాఖ అప్ లింకింగ్, డౌన్ లింకింగ్ నిబంధనలకు అనుగుణంగా కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే, ఇప్పటికే మా టీవీ చానెల్స్‌ను స్టార్‌గ్రూప్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే, డైరెక్టర్లు మాత్రం పాతవాళ్లే కొనసాగుతున్నారు. దీంతో లైసెన్స్‌లను తమ పేరిట మార్చుకునేందుకు స్టార్‌గ్రూప్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
గత కొంత కాలంగా నిబంధనలు ఉల్లంఘించి ప్రసారాలను కొనసాగిస్తున్న 73 టీవీ చానళ్లు సహా 24 ఎఫ్ఎం ఛానళ్లు, 9 పత్రికలపై నిషేధం విధిస్తున్నట్టు సమాచార, ప్రసారాల శాఖ తెలిపింది. అప్ లింకింగ్ గైడ్ లైన్స్ పాటించనందుకు ఇంతవరకూ 73 ఛానళ్ల అనుమతులు రద్దు చేసినట్టు రాజ్యసభకు ఐఅండ్ బీ(ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్) శాఖ సహాయమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ వెల్లడించారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం