భారత్ ఇ-మైగ్రేట్ సిస్టం కు శ్రామికులనుండి అనూహ్య స్పందన!
- July 26, 2015
మోసపూరిత ఉద్యోగావకాశాల వల నుండి ముఖ్యంగా అల్ప ఆదాయ వర్గాలవారిని, కార్మికులను కాపాడడానికి భారత ప్రభుత్వం వారిచే జూన్ 1 నుండి ప్రవేశపెట్టబడిన ఇ-మైగ్రేట్ సిస్టం కు మంచి స్పందన లభిస్తోంది. శ్రామికులకు ఉద్యోగం అవకాశం గుర్తింపుపొందినది కానట్లైతే, వారు ఏమిగ్రేషన్ చెక్ రెక్వేర్డ్ (ECR) వద్ద సమర్పించిన పాస్ పోర్టు తిరస్కరించబడుతుంది. అబుధాబీ లోని భారత రాయబార కార్యాలయం రెండవ సెక్రెటరీ శ్రీ మొహమ్మద్ షహీద్ అలం ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉద్యొగార్ధులు విదేశాలకు వెళ్లబోయేముందు భారత్ లోని ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, చండీఘడ్, కోచి, తిరువనంతపురం మరియు జైపూర్ లలో ఉన్న "ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్" వారి కార్యాలయాలకు వెళ్లినాట్లైతే, ఆ అవకాశాలు, వేతనాలను పరీక్షించి చెపుతారని, ఒకవేళ గుర్తింపులేని సంస్థలైతే, శ్రామికులు విదేశాలకు వెళ్ళడానికి అనుమతించరని ఆయన వివరించారు. ఈ ఇ-మైగ్రేట్ సిస్టం లో రిజిస్టర్ చేసుకున్నవారి సంఖ్య 18 నుండి ఒక్కసారిగా 195 కు పెరిగిందని కూడా వారు తెలియజేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!









