నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- July 07, 2026
అబుదాబి: నకిలీ, కల్తీ, గడువు ముగిసిన ఉత్పత్తుల కొనుగోలు ప్రజల ఆరోగ్యంతో పాటు భద్రతకు కూడా తీవ్రమైన ముప్పుగా మారుతుందని యూఏఈ అధికారులు హెచ్చరించారు. కేవలం విశ్వసనీయ దుకాణాలు, ధృవీకరించిన ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో మాత్రమే కొనుగోళ్లు చేయాలని సూచించారు. ఉత్పత్తిని కొనుగోలు చేసే ముందు ప్యాకేజింగ్, ఉత్పత్తి వివరాలు, తయారీ దేశం, గడువు తేదీని తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. కొనుగోలు అనంతరం బిల్లు, రసీదు, వారంటీ కార్డులను భద్రంగా ఉంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా సోషల్ మీడియా, అనధికారిక ఆన్లైన్ విక్రేతల నుంచి వస్తువులు కొనుగోలు చేయవద్దని హెచ్చరించారు.
నకిలీ వస్తువుల వ్యాపారం నేరం
2023 నాటి ఫెడరల్ డిక్రీ-లా నం. 42 (వాణిజ్య మోసాల నిరోధక చట్టం) ప్రకారం నకిలీ, కల్తీ లేదా పాడైన ఉత్పత్తులను దిగుమతి చేయడం, తయారు చేయడం, నిల్వ చేయడం, రవాణా చేయడం, విక్రయించడం, ప్రచారం చేయడం లేదా వ్యాపారం చేయడం నేరంగా పరిగణిస్తారు. ఈ కార్యకలాపాలకు ప్రయత్నించడం కూడా చట్ట ఉల్లంఘనగానే భావిస్తారు. అలాగే వినియోగదారులను ఉత్పత్తి నాణ్యత, పరిమాణం, తయారీ దేశం లేదా గడువు విషయంలో తప్పుదోవ పట్టించడం, తప్పుడు ప్రకటనలతో ఉత్పత్తులను విక్రయించడం కూడా వాణిజ్య మోసంగా పరిగణించబడుతుంది. ఆహార పదార్థాలు, మందులు, సౌందర్య సాధనాలు వంటి నియంత్రిత ఉత్పత్తుల్లో నకిలీ లేదా కల్తీ వస్తువుల విక్రయం ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతుందని అధికారులు పేర్కొన్నారు.
రూ.2.3 కోట్ల వరకు జరిమానా.. రెండేళ్ల జైలు
చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలు విధిస్తారు. నకిలీ, కల్తీ లేదా పాడైన వస్తువుల దిగుమతి, తయారీ, నిల్వ, రవాణా, ప్రచారం లేదా విక్రయంలో ఉద్దేశపూర్వకంగా పాల్గొన్న వారికి గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష, 5,000 దిర్హామ్‌ల నుంచి 1 మిలియన్ దిర్హామ్‌ల వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ఈ కఠిన నిబంధనల ద్వారా వినియోగదారుల హక్కులను కాపాడడంతో పాటు మార్కెట్‌పై ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేయాలని యూఏఈ లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు.
వినియోగదారులకు సూచనలు
అనుమానాస్పద ఉత్పత్తులు లేదా తప్పుడు ప్రకటనలు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని అధికారులు కోరుతున్నారు. వినియోగదారులు తమ భద్రత కోసం ఈ సూచనలు పాటించాలని సూచించారు.
* లైసెన్స్ పొందిన దుకాణాలు, ధృవీకరించిన వెబ్సైట్లలో మాత్రమే కొనుగోలు చేయాలి.
* ప్యాకేజింగ్, ఉత్పత్తి వివరాలు, తయారీ దేశం, గడువు తేదీని పరిశీలించాలి.
* బిల్లులు, రసీదులు, వారంటీ పత్రాలను భద్రంగా ఉంచుకోవాలి.
* సోషల్ మీడియా లేదా అనధికారిక విక్రేతల నుంచి కొనుగోళ్లు చేయకూడదు.
* అనుమానాస్పద ఉత్పత్తులు లేదా మోసపూరిత ప్రకటనలను వెంటనే అధికారులకు తెలియజేయాలి.
తాజా వార్తలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్‌కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్‌లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







